Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disney India: రిలయన్స్‌ చేతికి డిస్నీ ఇండియా! డీల్‌ కుదిరితే ఇక ఏకచత్రాధిపత్యమే! అంబానీ అందుకుంటారా?

వాల్ట్‌ డిస్నీకు సంబంధించి, ఇండియాలో టెలివిజన్ సహా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వ్యాపారం మొత్తాన్ని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ అనే వార్తా సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. అవసరం అయితే హాట్‌స్టార్‌, స్పోర్ట్స్‌ హక్కులను కూడా అమ్మేయలని చూస్తోందని చెప్పింది. ఇప్పటికే పలువురు కొనుగోలుదారులతో సైతం చర్చలు జరిపినట్లు వివరించింది. అయితే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ దీనిపై ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Disney India: రిలయన్స్‌ చేతికి డిస్నీ ఇండియా! డీల్‌ కుదిరితే ఇక ఏకచత్రాధిపత్యమే! అంబానీ అందుకుంటారా?
Disney India
Follow us
Madhu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 20, 2023 | 6:55 AM

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ.. ఈ పేరు తెలియని వారుండరు. టెలికాం రంగంలో రిలయన్స్‌ జియోను అత్యుత్తమంగా మార్చిన సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మ్యాన్‌. ఇప్పటికే ఈ రంగంలో ఎవరూ పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు మరో వార్త నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ వాల్ట్‌ డిస్నీని కూడా అంబానీ చేజిక్కించుకోన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అంబానీ దేశంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్‌ ఇప్పుడు ఆ రంగంలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న డిస్నీని కొనుగోలు చేస్తే మార్కెట్‌ మొత్తం రిలయన్స్ చేతిలోకి వెళ్లినట్లు అవుతుంది.

అమ్మకానికి డిస్నీ ఇండియా..

వాల్ట్‌ డిస్నీకు సంబంధించి, ఇండియాలో టెలివిజన్ సహా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వ్యాపారం మొత్తాన్ని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ అనే వార్తా సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. అవసరం అయితే హాట్‌స్టార్‌, స్పోర్ట్స్‌ హక్కులను కూడా అమ్మేయలని చూస్తోందని చెప్పింది. ఇప్పటికే పలువురు కొనుగోలుదారులతో సైతం చర్చలు జరిపినట్లు వివరించింది. అయితే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ దీనిపై ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కారణమిదేనా..

గతేడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ప్రసార హక్కుల ద్వారా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ దేశంలో చొచ్చుకుపోయింది. భారీ ఎత్తున సబ్‌ స్క్రైబర్లు వచ్చి చేరారు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ ప్రసార హక్కులను రిలయన్స్‌ కు చెందిన వయాకామ్‌ 18 దక్కించుకుంది. దీంతో జియో టీవీ ద్వారా ఐపీఎల్‌ ఫ్రీ స్ట్రీమింగ్‌ చేసింది. దీంతో హాట్‌ స్టార్‌ సబ్‌స్క్రైబర్లు అందరూ జియో వైపు రావడం మొదలుపెట్టారు. ఫలితంగా హాట్‌ స్టార్‌ సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతూ వచ్చారు. ఈ నేపథ్యంలో డిస్నీ సంస్థ తమ వ్యాపారాన్ని భారతదేశంలో పూర్తిగా నిలిపివేయడం కానీ లేదా సంయుక్తంగా నిర్వహించే విధంగా ప్రయత్నాలు చేసినట్లు కూడా మార్కెట్‌ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఏకంగా డిస్నీ ఇండియా తన మొత్తం బిజినెస్‌ను అమ్మేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక బహిర్గతం చేయడంతో ఆ వాదనలకు బలం చేకూరినట్లు అయ్యింది.

ఇవి కూడా చదవండి

డీల్‌ కాకపోవచ్చు..

అయితే డిస్నీ చేస్తున్న చర్చలు ఫలిభరితం కాకపోవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. డీల్‌ వరకూ వెళ్లకపోవచ్చని చెబుతున్నారు. అయితే మన దేశంలో క్రికెట్‌ టెలివిజన్‌ ప్రసారహక్కులు మాత్రం 2027 వరకూ డిస్నీ చేతిలోనే ఉన్నాయి. దీనికి తోడు పురుషుల క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించి డిజిటల్‌ రైట్స్‌ తనవద్ద పెట్టుకున్న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌.. టీవీ ప్రత్యక్ష ప్రసారాల కోసం జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ తో నాలుగు ఏళ్లకు అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..