- Telugu News Photo Gallery Smartphone Cleaning Tips: Follow These Tricks To Avoid Mistakes of Mobile Cleaning, Know Details
Mobile Cleaning Tips: ఈ చిన్న పొరపాటు కారణంగా మీ స్మార్ట్‌ఫోన్ పాడైపోతుంది.. మొబైల్ క్లీన్ చేసేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Mobile Cleaning Tips: స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేయడం వల్ల దాని పనితీరు మరింత తగ్గుతుందని చాలా మంది అనుకుంటుంటారు. మబైల్లోకి నీరు చేరే అవకాశం ఉందని, తద్వారా మొబైల్ పాడైపోతుందని అంతా భావిస్తారు. అయితే, మీ ఫోన్‌లో బ్యాక్టీరియా, క్రిములు ఏ రేంజ్‌లో పేరుకుపోతున్నాయో అనేది ఏమైనా ఆలోచించారా?
Updated on: Sep 20, 2023 | 4:13 AM

చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌లను రెగ్యులర్‌గా క్లీన్ చేయడం ఇష్టం ఉండదు. రెగ్యులర్‌గా క్లీనింగ్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్, ఏదైనా డివైజ్‌ని కొత్తవిలా ఉంచుకోవచ్చు. స్పీకర్ నుండి ఛార్జింగ్ పోర్ట్ వరకు, దుమ్ము, ధూళి పేరుకుపోతుంది.

స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేయడం వల్ల అది పాడైపోతుందని చాలా మంది అనుకుంటారు. స్పీకర్, ఛార్జింగ్ పిన్‌లోకి నీరు చేరవచ్చని భావిస్తారు. అయితే, మీ ఫోన్‌లో బ్యాక్టీరియా, క్రిములు ఎంత పేరుకుపోతున్నాయో ఏమైనా ఆలోచిస్తారా?

స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేయడం కష్టమేమీ కాదు. కొన్ని విషయాలపై శ్రద్ధ చూపకపోవడం మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసే ముందు కొన్ని చిట్కాలు తెలుసుకోండి.

స్మార్ట్‌ఫోన్ వెలుపలి భాగాన్ని సున్నితంగా శుభ్రం చేయండి. అందుకోసం మెత్తని క్లాత్‌ను ఉపయోగించండి. ఏదైనా దుమ్ము, వేలిముద్రలు లేదా స్మడ్జ్‌లను తొలగించడానికి ఫోన్ వెనుక, ముందలి భాగం శుభ్రం చేయండి.

క్లియర్ పోర్ట్, స్పీకర్, హెడ్‌ఫోన్ జాక్ ఎక్కువ మొత్తంలో దుమ్ము, దూళి పేరుకుంటాయి. వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే రోజుకో ప్రదర్శన చేస్తూనే ఉంటారు.

ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ద్రావణంలో ముంచిన దూదితో శుభ్రం చేయండి. మీ ఫోన్ పోర్ట్‌లు, స్పీకర్‌లు, హెడ్‌ఫోన్ జాక్‌లలోకి ఎక్కువ ద్రవం చేరకుండా జాగ్రత్త వహించండి.

మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై స్మడ్జ్‌లు, గీతలు పడకుండా ఉండేందుకు, స్క్రీన్ ప్రొటెక్టర్‌ని కొనుగోలు చేయండి. పొరపాటున చేతిలో నుంచి ఫోన్ పడిపోయినా స్క్రీన్ ఏ విధంగానూ పాడవకుండా ఉంటుంది.

అలాగే తుడిచిన తర్వాత పొడి మైక్రోఫైబర్ క్లాత్‌తో స్క్రీన్‌ను శుభ్రం చేయండి. ఆ తర్వాత గాలికి ఆరనివ్వాలి. అయితే, హెయిర్ డ్రైయర్ ఉపయోగించవద్దు.





























