India Browser: కేంద్రం కీలక నిర్ణయం.. భారతదేశానికి సొంత బ్రౌజర్.. గూగుల్-మైక్రోసాఫ్ట్‌లకు ఎదురుదెబ్బ!

|

Mar 21, 2025 | 10:27 AM

India Browser: దేశానికి సొంత బ్రౌజర్ ఉంటే అది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మొదటి, అతిపెద్ద ప్రయోజనం డేటా భద్రత. దీనిలో దేశ డేటా దేశంలోనే ఉంటుంది. అలాగే దేశ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. రెండవ అతిపెద్ద ప్రయోజనం ప్రైవసీ. ఇది డేటా రక్షణ చట్టానికి అనుగుణంగా ఉంటుంది..

India Browser: కేంద్రం కీలక నిర్ణయం.. భారతదేశానికి సొంత బ్రౌజర్.. గూగుల్-మైక్రోసాఫ్ట్‌లకు ఎదురుదెబ్బ!
Follow us on

గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు భారతదేశం తన సొంత బ్రౌజర్‌ను తయారు చేసుకోవడానికి సిద్ధమవుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం లాంటి దేశానికి సొంత బ్రౌజర్ ఉంటే, అది గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు పెద్ద దెబ్బ అవుతుంది. కానీ భారత ప్రభుత్వం దేశంలోని ఐటీ కంపెనీలకు సొంతంగా బ్రౌజర్ తయారు చేసుకోవాలని సూచనలు ఇచ్చింది. ప్రభుత్వం దేశంలోని వివిధ స్టార్టప్‌లు, ఐటీ కంపెనీలకు బ్రౌజర్‌ను అభివృద్ధి చేయడానికి ఒక పోటీని కూడా నిర్వహించింది. ఇందులో మూడు ఉత్తమ కంపెనీలు కూడా షార్ట్‌లిస్ట్ చేసింది కేంద్రం.బెస్ట్ బ్రౌజర్ మేకర్ అవార్డును అందుకున్న మూడు కంపెనీలు ఏవో తెలుసుకుందాం.

58 కంపెనీలలో 3 కంపెనీలు విజేతలుగా..

భారతదేశం $282 బిలియన్లకు పైగా ఆదాయంతో బలమైన ఐటీ రంగాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు సేవలపైనే దృష్టి సారించారు. భారత ప్రభుత్వం స్టార్టప్‌లు, విద్యాసంస్థలు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తోంది. భారతదేశాన్ని ఒక ఉత్పత్తి దేశంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. ప్రభుత్వం స్వదేశీ బ్రౌజర్‌ను అభివృద్ధి చేయాలని సవాలు విసిరింది. విద్యావేత్తలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా స్పందించారు. మొత్తం 58 ఎంట్రీలు వచ్చాయి. క్షుణ్ణంగా మూల్యాంకనం చేసిన తర్వాత 3 విజేతలను షార్ట్‌లిస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Smart TV Cleaning: టీవీ శుభ్రం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? స్క్రీన్‌ దెబ్బతిన్నట్లే..

వారికి అవార్డ్‌లు:

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెబ్ బ్రౌజర్ ఛాలెంజ్ విజేతలను ప్రకటించారు. దీనిలో మొదటి బహుమతిని టీం జోహోకు ఇచ్చారు. జోహోకు ప్రైజ్ మనీగా రూ.1 కోటి ఇచ్చారు. రెండవ బహుమతిని పింగ్ కు ప్రదానం చేశారు. బహుమతి అందుకున్న మొత్తం రూ. 75 లక్షలు. మూడవ బహుమతి టీం అజ్నాకు దక్కింది. వారికి రూ. 50 లక్షల బహుమతి లభించింది. విజేతలు టైర్ 2, టైర్ 3 నగరాల నుండి రావడం చూడటం ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. బ్రౌజర్ ఇంటర్నెట్ కు ప్రవేశ ద్వారం లాంటిది. సర్ఫింగ్, ఇమెయిల్, ఇ-ఆఫీస్, ఆన్‌లైన్ లావాదేవీలు మొదలైనవి ఎక్కువగా బ్రౌజర్‌లోనే జరుగుతాయి.

భారతదేశం సొంత బ్రౌజర్ ప్రయోజనాలు:

దేశానికి సొంత బ్రౌజర్ ఉంటే అది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మొదటి, అతిపెద్ద ప్రయోజనం డేటా భద్రత. దీనిలో దేశ డేటా దేశంలోనే ఉంటుంది. అలాగే దేశ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. రెండవ అతిపెద్ద ప్రయోజనం ప్రైవసీ. ఇది డేటా రక్షణ చట్టానికి అనుగుణంగా ఉంటుంది. భారత పౌరుల డేటా భారతదేశంలోనే ఉంటుంది. ఈ బ్రౌజర్ iOS, Windows, Android లకు అనుకూలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Bank Working Days: ఏప్రిల్ నుండి బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటాయా?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి