UPI IDని మనకు నచ్చినట్లు ఎలా మార్చుకోవాలి? అసలు ఎందుకు మార్చుకోవాలో తెలుసుకోండి!

Paytm ఇటీవల కస్టమ్ UPI ID ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇప్పుడు Google Pay, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ మీ లావాదేవీల గోప్యతను పెంచుతుంది, మీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ IDని దాచి ఉంచుతుంది. మీ వ్యక్తిగత IDని ఎలా సృష్టించుకోవాలో, ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.

UPI IDని మనకు నచ్చినట్లు ఎలా మార్చుకోవాలి? అసలు ఎందుకు మార్చుకోవాలో తెలుసుకోండి!
Custom Upi

Updated on: Sep 30, 2025 | 5:24 PM

Paytm ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) IDని మనమే క్రియేట్‌ చేసుకునే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా అదే ఫీచర్ Google Payతో పాటు ఇతర UPI ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులోకి వస్తోంది. కస్టమ్ ID ఫీచర్ ప్రైవసీని మరింత మెరుగుపర్చేందుకు తీసుకొచ్చింది. లావాదేవీలు చేస్తున్నప్పుడు వినియోగదారుల ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ IDని హైడ్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే మరి ఈ IDని ఎలా మార్చుకోవాలి. మనం ఎలా క్రియేట్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఈ ఫీచర్‌ను ప్రారంభించిన సమయంలో యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లకు మాత్రమే సపోర్ట్‌ చేసింది. కానీ ఇప్పుడు HDFC బ్యాంక్, SBI బ్యాంక్‌లకు కూడా సపోర్ట్‌ చేస్తోంది. Paytmలో IDని మార్చిన తర్వాత ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ కస్టమ్ ఆల్ఫాన్యూమరిక్ టెక్స్ట్‌తో భర్తీ అవుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI ద్వారా చేసే పీర్-టు-పీర్, పీర్-టు-మర్చంట్ లావాదేవీల కోసం లావాదేవీ విలువ పరిమితిని పెంచిన సమయంలో కొత్త ప్రైవసీ సెంట్రిక్‌ ఫీచర్ వచ్చింది.

పేటీఎంలో కస్టమైజ్‌ UPI IDని ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?

  • పేటీఎం యాప్ ఓపెన్‌ చేయండి
  • పై ఎడమ వైపు మూలలో ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి
  • UPI అండ్‌ పే సెట్టింగ్‌లకు వెళ్లండి. UPI ID పక్కన ఉన్న “View” ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి
  • వ్యక్తిగతీకరించిన UPI IDని ప్రయత్నించండి. టెక్స్ట్ పైన ఉన్న టెక్స్ట్ బాక్స్‌పై క్లిక్‌ చేయండి
  • దిగువన ఉన్న షీట్ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మీరు మీకు కావలసిన IDని టైప్ చేయవచ్చు లేదా సూచించబడిన ఎంపికల నుండి ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
  • కన్ఫామ్‌పై క్లిక్‌ చేయండి
  • అంతే.. మీ UPI IDని విజయవంతంగా మారుతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి