AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Home: కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి.. వాయిస్ కంట్రోల్‌తో లైట్లు, ఫ్యాన్లు ఆన్‌!

Smart Home Gadgets: కేవలం 2 వేల రూపాయలతోనే మీ పాత ఇంటిని స్మార్ట్‌గా మార్చేయవచ్చు. కేవలం వాయిస్ కంట్రోల్‌తోనే మీ ఇంట్లో ఉండే లైట్లు, ఫ్యాన్లు ఆన్‌ అవుతాయి. ఆఫ్‌ అవుతాయి. మరి ఆ స్మార్ట్ గాడ్జెట్లు ఏంటో తెలుసుకుందాం..

Smart Home: కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి.. వాయిస్ కంట్రోల్‌తో లైట్లు, ఫ్యాన్లు ఆన్‌!
Smart Home Gadgets
Subhash Goud
|

Updated on: Apr 27, 2026 | 1:46 PM

Share

Smart Home Gadgets: మీ ఇల్లు పాతదైనా సరే, దానిని హైటెక్ స్మార్ట్ హోమ్‌గా మార్చుకోవాలనే కల ఇప్పుడు నెరవేరబోతోంది. దీని కోసం మీరు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 2000 రూపాయల బడ్జెట్‌లో మీ గదిలోని లైట్లు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మీ గొంతుతోనే (Voice Control) నియంత్రించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి: Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!

ఏమేం కావాలి? (3 ముఖ్యమైన గ్యాడ్జెట్స్)

  • స్మార్ట్ బల్బ్ (Smart Bulb):
  • ధర: సుమారు రూ.399 – రూ.599.
  • ప్రత్యేకత: మీ సాధారణ బల్బ్ హోల్డర్‌లోనే దీనిని అమర్చవచ్చు. మొబైల్ యాప్ ద్వారా దీని రంగులను మార్చుకోవచ్చు. “Alexa, బెడ్‌రూమ్ లైట్ ఆన్ చేయి” అని చెబితే చాలు అది వెలుగుతుంది.

స్మార్ట్ ప్లగ్ (Smart Plug):

  • ధర: సుమారు రూ.399 – రూ.699.
  • ప్రత్యేకత: ఇది చాలా ఉపయోగకరమైన గ్యాడ్జెట్. మీ పాత ఫ్యాన్, టీవీ, గీజర్ లేదా మొబైల్ ఛార్జర్‌ను ఈ స్మార్ట్ ప్లగ్‌కు కనెక్ట్ చేస్తే చాలు.. అవి స్మార్ట్ డివైజ్‌లుగా మారిపోతాయి. మీరు ఇంట్లో లేకపోయినా దూరంగా ఉండి కూడా వీటిని ఆన్/ఆఫ్ చేయవచ్చు.

అమెజాన్ ఎకో డాట్ (Amazon Echo Dot – Alexa):

  • ధర: రూ.1,099 – రూ.1,499 (సేల్ సమయంలో మరింత తక్కువకే లభిస్తుంది).
  • ప్రత్యేకత: ఇది మీ స్మార్ట్ హోమ్ వ్యవస్థకు ఇదొక బ్రెయిన్‌ లాంటిది. మీరు ఇచ్చే వాయిస్ కమాండ్లను ఇది స్వీకరించి, ఇతర పరికరాలను పనిచేయించేలా చేస్తుంది.
  • మొత్తం ఖర్చు లెక్క (అంచనా):

మొత్తం ఖర్చులు:

  • 2 స్మార్ట్ బల్బులు – రూ.900- రూ.1,000
  • 1 స్మార్ట్ ప్లగ్ – రూ.500
  • 1 ఎకో డాట్ – రూ.1,000
  • మొత్తం: సుమారుగా రూ.1,900 – రూ.2,200

సెటప్ చేయడం ఎలా? చాలా సులభం

ఈ గ్యాడ్జెట్లను అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయండి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో Wi-Fi కనెక్షన్ ఉండేలా చూసుకోండి.

మీ ఫోన్‌లో Alexa App డౌన్లోడ్ చేసుకోండి.

యాప్‌లో ‘Add Device’ ద్వారా మీ బల్బ్, ప్లగ్, అలెక్సాను కనెక్ట్ చేయండి. అంతే ఇప్పుడు మీరు.. “Alexa, లైట్ ఆపు”, “Alexa, ఫ్యాన్ ఆన్ చేయి” అని హాయిగా ఆర్డర్ వేయవచ్చు. స్మార్ట్ హోమ్ అంటే ఖరీదైన విషయం అనే కాలం పోయింది. కేవలం రూ.2,000 పెట్టుబడితో మీ పాత ఇంటిని కూడా హైటెక్ శైలిలో మార్చుకోవచ్చు. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, అనవసరంగా లైట్లు వెలగకుండా చూస్తూ విద్యుత్ బిల్లును కూడా ఆదా చేస్తుంది.

ఇది కూడా చదవండి: Tulsi Plant: తులసి చెట్టుకు ఈ మిశ్రమాన్ని పోస్టే చాలు.. మండే ఎండలోనూ పచ్చగా ఎదుగుతుంది.. బెస్ట్‌ ట్రిక్స్‌..!

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త రూల్స్.. బుకింగ్‌పై కొత్త ఆంక్షలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us