చౌకైన ఎలక్ట్రిక్‌ సైకిల్‌..! ఒక్కసారి చార్జ్‌ చేస్తే 75 నుంచి 100 కిలోమీటర్లు.. ధర ఎంతంటే..?

| Edited By: Anil kumar poka

Aug 14, 2021 | 7:51 PM

Voltro Electric Bicycle : ఇండియన్ ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్ వోల్ట్రో మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్ల విక్రయలను లక్ష్యంగా పెట్టుకుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత చిన్న నగరాల్లో ఎలక్ట్రిక్ సైకిళ్ల డిమాండ్

చౌకైన ఎలక్ట్రిక్‌ సైకిల్‌..! ఒక్కసారి చార్జ్‌ చేస్తే 75 నుంచి 100 కిలోమీటర్లు.. ధర ఎంతంటే..?
Viral Photos5
Follow us on

Voltro Electric Bicycle : ఇండియన్ ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్ వోల్ట్రో మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్ల విక్రయలను లక్ష్యంగా పెట్టుకుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత చిన్న నగరాల్లో ఎలక్ట్రిక్ సైకిళ్ల డిమాండ్ పెరుగుతున్నట్లు కంపెనీ తెలిపింది. వోల్ట్రో మోటార్స్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. లాక్డౌన్ కారణంగా ప్రారంభంలో వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. వోల్ట్రో ఎలక్ట్రిక్ సైకిల్ సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుందని, ప్రస్తుతం చిన్న నగరాల్లో డీలర్లు, పంపిణీదారుల కోసం చూస్తున్నామని తెలిపారు.

వోల్ట్రో ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ఛార్జ్‌లో 75 కిమీ నుంచి100 కిమీ రేంజ్‌తో ప్రయాణిస్తుంది. గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ, ఒక మిడ్ డ్రైవ్ మోటార్‌తో అమర్చి ఉంటుంది. సిటీ రైడింగ్, ఆఫ్ రోడ్ రైడింగ్‌కు ఇది అనువైనదని కంపెనీ పేర్కొంది. ఇ-బైక్ ధర రూ. 35,000. వోల్ట్రో ఎలక్ట్రిక్ సైకిల్ 700 వాట్ల శక్తిని వినియోగిస్తుంది. మూడు గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఖర్చు సగటున రూ.4 కి వస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది చిన్న నగరాల్లో డిమాండ్ పెరగడానికి ఒక కారణం. ఈ-బైక్‌ను స్థానికంగా సులభంగా రిపేర్ చేయవచ్చు విడి భాగాలను మార్చవచ్చు.

కంపెనీ ఆగష్టు 2020 లో దేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. తన మొదటి ఆర్థిక సంవత్సరాన్ని 35 లక్షల టర్నోవర్‌తో పూర్తి చేసింది. పరిస్థితి సాధారణ స్థితిలో ఉంటే కంపెనీ 8 నుంచి10 కోట్ల అమ్మకాలను తాకుతుందని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తున్నామని, లక్ష్యాన్ని చేరుకోవడానికి బ్యాండ్‌విడ్త్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. అంతేకాదు ఒక నెలలోపు దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ ఉత్పత్తిని నెలకు 400 యూనిట్ల నుంచి 1,000-1,500 యూనిట్లకు పెంచడానికి ఢిల్లీలో ఫ్యాక్టరీని విస్తరిస్తోంది.

Read Also: Viral Photos : ఇది ప్రపంచంలో అతి చిన్న నది.. పొడవు 61 మీటర్లు మాత్రమే.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..?

Ram Gopal Varma: విజయేంద్ర ప్రసాద్ గడ్డం పై వర్మ సంచలన కామెంట్స్.. అంతమాట అనేశాడేంటి..!!

Horoscope Today: ఈ రాశివారికి ఆపదలున్నాయి.. అజాగ్రత్త వద్దు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ