ఏఐ బాబాయ్ వచ్చేస్తున్నాడు.. మన కొలువులకు ఎసరేనా?

ఇంతకీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వరమా, శాపమా అంటే.. రెండూనూ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక గిబ్లితో ట్రెండ్‌తో అయితే మహా ప్రమాదంలో ఇరుక్కున్నట్టే. గిబ్లీ ఇమేజెస్‌ కోసం పెట్టే ఫొటోస్‌ను రేప్పొద్దున ఐరిస్‌గా వాడుకుని ఫోన్‌తో సహా బ్యాంక్‌ లాకర్లను కూడా యాక్సెస్ చేస్తుందట. గిబ్లీ అనే కాదు. ఎవరి పర్సనల్‌ ఫొటోస్‌ అయినా.. సోషల్‌ మీడియా చేతిలో.. అందులోనూ AI చేతిలో పడితే పిచ్చోడి చేతిలో రాయి పడ్డట్టే ఇక..! అటు రాజకీయ రంగంలోనూ మున్ముందు ఏఐ దుర్వినియోగం పెరగబోతోంది.

ఏఐ బాబాయ్ వచ్చేస్తున్నాడు.. మన కొలువులకు ఎసరేనా?
Artificial Intelligence

Updated on: Apr 22, 2025 | 8:55 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. త్వరలో మనిషిని రీప్లేస్‌ చేయబోతోంది. సంతోషం. కాని, మనమెవరం ఊహించని దారుణాలు కూడా చేయబోతోందే.. దానికేం చేయడం..? సపోజ్.. ఒక మ్యూజిక్‌ డైరెక్టర్.. వంద మంది కళాకారులతో ఓ సౌండ్‌ క్రియేట్‌ చేస్తాడు. కనీసం 20, 30 ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ఉపయోగించి మైండ్‌ బ్లోయింగ్‌ సంగీతాన్ని సృష్టిస్తాడు. దాన్ని క్రియేట్‌ చేయడానికి ఆయన పడిన కష్టం కొన్ని వారాలు లేదా నెలలు కావొచ్చు. కాని, అలాంటి మ్యూజిక్‌నే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్షణాల్లో క్రియేట్ చేస్తోంది. ఆ సౌండ్‌ విన్నాక.. వావ్, సూపర్ అంటూ మనమంతా క్లాప్స్‌ కొట్టి, హ్యాట్సాఫ్‌ చెబుతాం. ఎంతైనా ఏఐ ఏఐనే అని పొగుడుతాం. ఆ టైమ్‌లో.. ఒక్కసారి తల తిప్పి ఆ మ్యుజీషియన్‌ వైపు చూడండి. సంగీతం నేర్చుకోడానికి ఆయన పడిన కష్టం, తపన ఏమైపోవాలి. చిన్నప్పటి నుంచి సాధన చేసి, గురువుల దగ్గర విద్య నేర్చుకుని, తన ప్రతిభను ప్రదర్శించడానికి ఎన్నో కష్టాలు పడితే.. ఏఐ మాత్రం ఆ కష్టాన్నంతా బూడిదపాలు చేసినట్టు అనిపించడం లేదూ..! ఒక మ్యుజీషియన్ వారాల పాటు తానొక్కడే కష్టపడి ఓ వందమంది కళాకారులకు జీవితాన్ని ఇస్తున్నాడు. అదంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ కారణంగా భూస్థాపితం కావడం లేదా..! ఇక్కడ రెండు వర్షన్స్ ఉన్నాయి. ఎవరి వర్షన్ వారిదే. ఎవరో కష్టం బూడిదపాలు అవుతోందని టెక్నాలజీని వద్దంటామా అని కొందరు. టెక్నాలజీని స్వీకరిద్దాం.. బట్‌ ఎట్‌ వాట్‌ కాస్ట్ అని మరికొందరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి