Apple iPad: ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 20 వేలకే యాపిల్‌ ఐప్యాడ్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాపిల్ ఐప్యాడ్‌పై కూడా కళ్లు చెదిరే ఆఫర్‌ లభిస్తోంది. 64 జీబీ కెపాసిటీ యాపిల్‌ ఐప్యాడ్‌ 9th జనరేషన్‌ ఐప్యాడ్ అసలు ధర రూ. 33,900గా ఉండగా.. ప్రస్తుంత సేల్‌లో భాగంగా 23 శాతం డిస్కౌంట్‌తో రూ. 25,999 లభిస్తోంది. వీటితో పాటు....

Apple iPad: ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 20 వేలకే యాపిల్‌ ఐప్యాడ్‌..
Apple Ipad (9th Gen)

Updated on: Oct 08, 2023 | 7:32 PM

యాపిల్‌ బ్రాండ్‌కు సంబంధించిన ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనే కోరిక ఉంటుంది. అయితే యాపిల్‌ బ్రాండ్‌ ధరలు అధికంగా ఉంటాయని తెలిసిందే. అందుకే యాపిల్‌ బ్రాండ్‌ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాలని ఉన్నా ధర విషయంలో వెనుకడుగు వేస్తుంటారు. మీరు కూడా ఈ ఆలోచనతోనే ఉన్నారా.? అయితే మీకోసమే ఫ్లిప్‌కార్ట్‌లో ఓ మంచి డీల్‌ అందుబాటులోకి వచ్చింది. యాపిల్‌ ఐప్యాడ్ 9th జెన్‌ ఐప్యాడ్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం లభించింది.

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాపిల్ ఐప్యాడ్‌పై కూడా కళ్లు చెదిరే ఆఫర్‌ లభిస్తోంది. 64 జీబీ కెపాసిటీ యాపిల్‌ ఐప్యాడ్‌ 9th జనరేషన్‌ ఐప్యాడ్ అసలు ధర రూ. 33,900గా ఉండగా.. ప్రస్తుంత సేల్‌లో భాగంగా 23 శాతం డిస్కౌంట్‌తో రూ. 25,999 లభిస్తోంది. వీటితో పాటు ఐసీఐసీ, యాక్సిస్‌ బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో అదనంగా గరిష్టంగా రూ. 1500 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద ఏకంగా రూ. 25000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇక యాపిల్‌ ఐప్యాడ్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఐప్యాడ్‌ ఐఎఓస్‌ 15తో పని చేస్తుంది. 64 జీబీ స్టోరేజ్‌ దీని సొంతం. ఇందులో 10.2 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. యాపిల్‌ ఐప్యాడ్‌ ఏ13 బయోనిక్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇక 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, ప్రీమియం మెటల్‌ బాడీని అందించారు.

2160×1620 పిక్సెల్స్ రిజల్యూషన్, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్ ఈ ఐప్యాడ్ స్క్రీన్‌ సొంతం. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఐప్యాడ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 గంటల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. ఇక నెట్‌వర్క్‌ విషయానికొస్తే.. వైఫై, వైఫై + సెల్యులార్‌, డ్యూయల్ బ్యాండ్‌ వైఫై (2.4 గిగా హెర్ట్జ్‌, 5 గిగా హెర్ట్జ్‌) అందించారు. ఇక ఈ ఐప్యాడ్‌ బరువు 498 గ్రాములుకాగా డిస్‌ప్లేలో హార్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..