
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు యాపిల్ ఐఫోన్లు ప్రత్యేక క్రేజ్ ఉంది. ముఖ్యంగా మన డేటా భద్రతో పాటు ఐఫోన్స్‌లో వచ్చే ఫీచర్లు ఏ ఇతర ఫోన్లు ఇవ్వకపోవడంతో అధిక సంఖ్యలో యువత ఐఫోన్‌లపై మక్కువ చూపుతున్నారు. యాపిల్ కంపెనీ పెరిగిన డిమాండ్‌కు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ నయా ఫోన్స్ రిలీజ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఐఫోన్-15 ప్లస్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.17,870కే ఐఫోన్ అందిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు ఇన్‌స్టంట్ తగ్గింపులతో ఈ ఫోన్ రూ.17 వేలకు వినియోగదారుల చేతికి రానుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్-15 రూ.17,870కే ఎలా పొందాలో? ఓసారి తెలుసుకుందాం.
యాపిల్ ఐఫోన్-15 ప్లస్ (128 జీబీ) వేరియంట్ అసలు ధర రూ. 89,600. అయితే ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు అమెజాన్‌లో 10 శాతం సాధారణ తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్ రూ. 80,600కి తగ్గింది. అయితే మంచి స్థితిలో ఉన్న క్వాలిఫైయింగ్ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే కస్టమర్లకు రూ. 58,700 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపును కూడా అందిస్తోంది. అదనంగా అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే కస్టమర్లు రూ. 4,030 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లను కలపడం ద్వారా ఐఫోన్ 15 ప్లస్ కేవలం రూ.17,870కు కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..