Boult TWS: గేమింగ్ ప్రియులకు అదిరిపోయే ఇయర్‌ బడ్స్‌.. చాలా తక్కువ ధరలోనే

|

Jun 09, 2024 | 3:34 PM

బౌల్ట్‌ ఇయర్‌డ్స్‌ జెడ్‌40, వై1 పేరుతో రెండు కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేశారు. రెండు ఇయర్‌డ్స్‌ను కూడా బడ్జెట్‌ ధరలోనే తీసుకురావడం విశేషం. ఈ ఇయర్‌ బడ్స్‌ను బౌల్ట్‌ ఏఎమ్‌పీ యాప్‌ ద్వారా కనెక్ట్ చేసుకొని, ఆపరేట్ చేసుకోవచ్చు. గేమ్‌ ప్లే సమయంలో టచ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌ను అందించారు. అలాగే ఈ ఇయర్‌ బడ్స్‌లో అదనంగా...

Boult TWS: గేమింగ్ ప్రియులకు అదిరిపోయే ఇయర్‌ బడ్స్‌.. చాలా తక్కువ ధరలోనే
Boult Gaming Ear Buds
Follow us on

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌లో గేమింగ్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. గేమింగ్స్‌కు ప్రత్యేకంగా ర్యామ్స్‌ను అందిస్తున్నాయి కంపెనీలు. అయితే ఫోన్‌లో గేమ్స్‌ను మరింత ఎక్స్‌పీరియన్స్‌ చేయాలంటే ఇయర్‌ బడ్స్‌ కూడా కీలక పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా ఇయర్‌ బడ్స్‌ను తీసుకొస్తున్నారు. అయితే వీటి ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటాం. కానీ తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్‌ తయారీ సంస్థ బౌల్ట్‌ మార్కెట్లో రెండు కొత్త గేమింట్ ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేశాయి.

బౌల్ట్‌ ఇయర్‌డ్స్‌ జెడ్‌40, వై1 పేరుతో రెండు కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేశారు. రెండు ఇయర్‌డ్స్‌ను కూడా బడ్జెట్‌ ధరలోనే తీసుకురావడం విశేషం. ఈ ఇయర్‌ బడ్స్‌ను బౌల్ట్‌ ఏఎమ్‌పీ యాప్‌ ద్వారా కనెక్ట్ చేసుకొని, ఆపరేట్ చేసుకోవచ్చు. గేమ్‌ ప్లే సమయంలో టచ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌ను అందించారు. అలాగే ఈ ఇయర్‌ బడ్స్‌లో అదనంగా IPX5 వాటర్ రెసిస్టెంట్‌తో డిజైన్‌ చేశారు. డీప్‌ గేమింగ్‌ సెషన్స్‌లో చమట పట్టడం ద్వారా ఇయర్‌ బడ్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగదు.

ఈ ఇయర్‌ బడ్స్‌లో బూమ్‌ఎక్స్‌ టెక్నాలజీ, 10 ఎమ్‌ఎమ్‌ డ్రైవర్స్‌ను అందించారు. దీంతో ఈ ఇయర్‌ బడ్స్‌ను స్పష్టమైన క్వాలిటీ, బేస్‌తో కూడిన ఆడియోను ఆస్వాదించవచ్చు. బౌల్ట్‌ జెడ్‌40 ఇయర్‌ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 60 గంటల బ్యాటరీ లైఫ్‌ లభిస్తుంది. వీటికి ప్రత్యేకంగా బేస్‌ మాస్, ఎలక్ట్రిక్‌ వైట్ కలర్‌ వేరియంట్‌లలో ఆర్‌జీబీ లైట్స్‌ను అందించారు. మంచి గేమింగ్ అనుభూతిని అందించేలా వీటి సౌండ్‌ క్వాలిటీ ఉంటుంది.

ఇక బౌల్ట్‌ వై1 ఇయర్‌ బడ్స్‌ విషయానికొస్తే వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 50 గంటల ప్లేటైమ్‌ వస్తుంది. ఇందులో కూడా ఆర్‌జీబీ లైట్స్‌ను అందించారు. బ్లాక్ మెటల్, ఎలక్ట్రిక్ రెడ్, గ్లేసియర్ బ్లూ కలర్స్‌లో వీటిని తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే జెడ్‌40 ఇయర్‌ బడ్స్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు బౌల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1299కి అందుబాటులో ఉన్నాయి. అలాగే వై1 గేమింగ్‌ ఇయర్‌ బడ్స్‌ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు బౌల్ట్‌ వెబ్‌సైట్‌లో రూ. 1199కి లభిస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..