దేశీయ గ్యాడ్జెట్ రంగంలో బోట్ కంపెనీ దూసుకుపోతోంది. తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో కూడిన ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇయర్ ఫోన్స్, సౌండ్ స్పీకర్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకు కొంగొత్త ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి లాంచ్ చేస్తూ వస్తోన్న బోట్ కంపెనీ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. బోట్ స్ట్రోమ్ కనెక్ట్ ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్‌ను తక్కువ ధరలో మంచి ఫీచర్లతో తీసుకురావడం విశేషం. ఇంతకీ ఈ స్మార్ట్‌వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం.
బోట్ స్ట్రోమ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్‌లో 1.91 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో రూపొందించిన ఈ డిస్‌ప్లే 2.5 కర్వ్డ్ గ్లాస్‌తో వస్తుంది. యాక్టివ్ బ్లాక్, యాక్టివ్ బ్లూ, కూల్ గ్రే, మెరూన్ అనే నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 1999గా ఉంది. ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు. ఇంత తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందించడం విశేషం. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా నేరుగా ఫోన్ కాల్స్ చేయడంతో పాటు, ఆన్సర్ చేయవచ్చు. బయట నుంచి ఎలాంటి సౌండ్స్ డిస్టబెన్స్ లేకుండా నాయిస్-ఫ్రీ కాలింగ్‌ను అందించారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా బోట్ స్ట్రోమ్ కనెక్ట్ ప్లస్‌లో SpO2 మానిటర్, హార్ట్‌బీట్ ట్రాకర్ వంటి హెల్త్ మానిటరీంగ్ వంటి హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత. వీటితో పాటు దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్ ఇచ్చారు. అలారం, కౌంట్‌డౌన్ టైమర్, స్టాప్‌వాచ్, ఎస్‌ఎమ్‌ఎస్ నోటిఫికేషన్, సోషల్ మీడియా, యాప్‌లు, మ్యూజిక్, కెమెరా కంట్రోల్, వెదర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్స్ అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..