Boat: గేమింగ్‌ లవర్స్‌ కోసం అదిరిపోయే ఇయర్‌ బడ్స్‌.. ధర ఎంతో తెలుసా.?

|

Nov 30, 2023 | 9:29 PM

ఐకానిక్‌ కటనా బ్లేడ్‌ నుంచి ప్రేరణతో ఈ ఇయర్‌ బడ్స్‌ను రూపొందించినట్లు బోట్ సంస్థ తెలిపింది. ఆకర్షణీయమైన, అధునాతన స్టైలిష్‌ డిజైన్‌తో ఈ ఇయర్‌ బడ్స్‌ను డిజైన్‌ చేశారు. అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ఇయర్‌ బడ్స్‌తో పొందొచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌లో గేమ్స్‌ ఆడేవారికి ఈ ఇయర్‌ బడ్స్‌ మంచి అనుభూతిని ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఇయర్‌ బడ్స్‌ ధర విషయానికొస్తే రూ. 2,299గా నిర్ణయించారు...

Boat: గేమింగ్‌ లవర్స్‌ కోసం అదిరిపోయే ఇయర్‌ బడ్స్‌.. ధర ఎంతో తెలుసా.?
Boat Gaming Earbuds
Follow us on

భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ బోట్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేసింది. గేమింగ్‌ లవర్స్‌ను టార్గెట్ చేసుకొని ప్రత్యేకంగా ఈ ఇయర్‌ బడ్స్‌ను తీసుకొచ్చారు. ఇమ్మోర్టల్‌ కటనా బ్లేడ్‌ పేరుతో ఈ కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేశారు. అధునాతన ఫీచర్లు, స్టైలిష్‌ లుక్స్‌తో ఈ ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఐకానిక్‌ కటనా బ్లేడ్‌ నుంచి ప్రేరణతో ఈ ఇయర్‌ బడ్స్‌ను రూపొందించినట్లు బోట్ సంస్థ తెలిపింది. ఆకర్షణీయమైన, అధునాతన స్టైలిష్‌ డిజైన్‌తో ఈ ఇయర్‌ బడ్స్‌ను డిజైన్‌ చేశారు. అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ఇయర్‌ బడ్స్‌తో పొందొచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌లో గేమ్స్‌ ఆడేవారికి ఈ ఇయర్‌ బడ్స్‌ మంచి అనుభూతిని ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఇయర్‌ బడ్స్‌ ధర విషయానికొస్తే రూ. 2,299గా నిర్ణయించారు. నిజానికి బోట్‌ ఈ ఇయర్‌ బడ్స్‌ను రూ. 3,999గా నిర్ణయించారు, అయితే లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 2,299కి సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

ఛార్జింగ్‌కు ఈ ఇయర్‌ బడ్స్‌లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా ఇయర్‌ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 50 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌తో వస్తుండడం విశేషం. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే ఏకంగా 180 నిమిషాలు నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుంది. ఈ ఇయర్‌ బడ్స్‌లో ఆర్‌జీబీ ఎల్‌ఈడీలను అందించారు. గన్‌మెటల్‌ బ్లాక్‌, గ్రే కలర్స్‌లో ఈ ఇయర్‌ బడ్స్‌ను తీసుకొచ్చారు. బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లోనూ ఈ ఇయర్‌ బడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

మెటల్ గ్లైడర్‌లో ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌లు అందించారు. దీంతో ఇయర్‌ బడ్స్‌ కేస్‌ ఓపెన్‌ చేసినప్పుడల్లా.. సౌండ్‌ వస్తుంది. ఇక ఈ ఇయర్‌ బడ్స్‌లో బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీతో పనిచేస్తాయి. IPX4 రేటింగ్‌ కలిగిన వాటర్‌ రెసిస్టెన్స్‌ వీటి సొంతం. బ్యాగ్రౌండ్‌ నాయిస్‌ సదుపాయంతో కాల్స్‌ కూడా డిస్బ్రబ్ లేకుండా మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ఇయర్‌బడ్స్‌లోని డ్యుయల్‌ మైక్‌లు ENx టెక్‌తో జోడించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..