Bluetooth Headphones: ఇటీవల బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ వాడకం బాగా పెరుగుతోంది. ఒకప్పుడు భారీ ధర పలికిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రస్తుతం అందుబాటులోకి ధరలోకి వచ్చేశాయి. కంపెనీల మధ్య పెరిగిన పోటీ, రోజుకో కొత్త హెడ్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోన్న తరుణంలో వీటి ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే రూ. 1000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
పీట్రాన్ కంపెనీకి చెందిన ఈ హెడ్‌ఫోన్స్ రూ. 799కి అందుబాటులో ఉన్నాయి. ఇందులో 8mm డైనమిక్ డ్రైవర్‌ను ఇచ్చారు. దీంతో స్టీరియో సౌండ్ అనుభూతిని పొందొచ్చు. బ్లూటూత్ v5.3కి సపోర్ట్ చేసే ఈ హెడ్‌ఫోన్స్‌ను 10 మీటర్ల వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్‌ను అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 48 గంటల నాన్ స్టాప్‌గా పనిచేస్తాయి.
ఈ వైర్ లెస్ ఈయర్ బడ్స్ ధర రూ. 899గా ఉంది. నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ వీటి ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 48 గంటలు పనిచేస్తుంది. బ్లూటూత్ v5.3కి సపోర్ట్ చేసే ఈ హెడ్‌ఫోన్స్‌ను 10 మీటర్ల వరకు కనెక్ట్ చేసుకోవచ్చు.
నెక్‌బ్యాండ్‌గా రూపొందించిన ఈ హెడ్‌ఫోన్స్ ధర రూ. 999గా ఉంది. బ్లూటూత్ 4.1 టెక్నాలజీతో పనిచేస్తుంది. కాల్స్ మాట్లాడుకోవడానికి స్పష్టతతో కూడిన సౌండ్ కోసం ఇందులో ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించారు.
రూ. వెయ్యిలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ హెడ్‌ఫోన్స్‌లో బోల్ట్ సంస్థకు చెందిన ఆడియో జెడ్‌చార్జ్ ఒకటి. వీటి ధర రూ. 899గా ఉంది. 40 గంటలకు నిర్వీరామంగా పనిచేస్తుంది. అలాగే 10 నిమిషాల పాటు చార్చింగ్ చేస్తే 15 గంటలు పనిచేస్తుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పనిచేసే ఈ హెడ్‌ఫోన్స్‌లో ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు.
నాయిస్ కంపెనీకి చెందిన ఈ హెడ్‌ఫోన్స్ రూ. 699కి అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 25 గంటలు పనిచేస్తుంది. నెక్‌బ్యాండ్ డిజైన్‌లో రూపొందించిన ఈ హెడ్‌ఫోన్స్ ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెంట్‌తో అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..