Best Photo Editing Apps: ఈ యాప్స్‌లో ఫొటో ఎడిటింగ్ చేస్తే.. లుక్ అదిరిపోతుంది!

ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ స్టేటస్, డీపీ.. ఇలా ఎక్కడైనా ఫొటో అప్ లోడ్ చేయాలంటే.. ఫొటో లుక్ ప్రొఫెషనల్ గా ఉండాలి. మరి దానికోసం ఏం చేయాలి? పెద్దగా చేయాల్సిందేమీ లేదు. ఫొటోకు కొద్దిగా రీ టచ్ ఇస్తే చాలు. అదే ఎడిటింగ్.. మరి ఎడిటింగ్ ఎలా చేయాలి? ఏ యాప్స్ వాడితే బెటర్.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Best Photo Editing Apps: ఈ యాప్స్‌లో ఫొటో ఎడిటింగ్ చేస్తే.. లుక్ అదిరిపోతుంది!
Photo Editing Apps

Updated on: Sep 17, 2025 | 5:58 PM

ఫొటో అందంగా దిగితే సరిపోదు దాన్ని ఎడిటింగ్ కూడా అంతే అందంగా చేయాలి. కొన్ని సార్లు ఫొటో బాగా రాకపోయినా ఎడిటింగ్ లో దాన్ని కవర్ చేయొచ్చు. మంచి ఫొటో ఎడిటింగ్  యాప్స్, అలాగే కొన్ని బేసిక్ ఎడిటింగ్ టెక్నిక్స్ తెలిస్తే చాలు మీ ఫొటో లుక్ ఇన్ స్టంట్ గా మారిపోతుంది. మరి అదెలాగో చూసేద్దామా?

గూగుల్ ఫొటో ఎడిటర్

ఆండ్రాయిడ్ మొబైల్ లో డీఫాల్డ్ గా వచ్చే ఫొటోస్ ఎడిటర్ ఇది. ముందు గ్యాలరీలోకి వెళ్లి ఫోటోపై క్లిక్ చేసి ఓపెన్ ఇన్ గూగుల్ ఫొటోస్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు అందులో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ను చదవండి. ఫొటోలో క్లారిటీ లేకపోతే షార్పెన్ అనే సెట్టింగ్ మార్చండి. ఫోటోలో లైటింగ్ ఎక్కువైంది అనిపిస్తే.. బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ లను మార్చి చూడండి. అలాగే ఫొటో సన్ రైజ్, సన్ సెట్ లో తీసినట్టుగా కనిపించాలంటే టింట్ లోకి వెళ్లి వార్మ్ టోన్ పెంచాలి. నైట్ లుక్ రావాలంటే.. టింట్ ను బ్లూ వైపుకి మార్చాలి. అలాగే ఇందులో రకరకాల ఫిల్టర్లు కూడా ఉంటాయి. వాటిని కూడా అప్లై చేసి చూసుకోవచ్చు.

పిక్స్ఎల్ఆర్(pixlr)

ఇదొక ఫొటో ఎడిటింగ్ వెబ్ సైట్. బ్రౌజర్ లేదా మొబైల్ లో కూడా దీన్ని ఉపయోగించొచ్చు. ఇందులో  లేయర్ ఎడిటింగ్ ఉంటుంది. అంటే బ్యాక్ గ్రౌండ్ ను రిమూవ్ చేయడం, హెయిర్ స్టైల్స్, లొకేషన్స్ మార్చడం వంటివి కూడా చేయొచ్చు. అలాగే ఇందులో స్మార్ట్ ఏఐ టూల్స్ సాయంతో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్ టూల్స్ ను కూడా ట్రై చేయొచ్చు.

ఫొటోపీ

మీకు ఫొటోషాప్ తరహా ఎడిటింగ్ తెలిసి ఉండి, మీ దగ్గర ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ లేకపోతే.. మీరు బ్రౌజర్ లోకి వెళ్లి ఫొటోపీ( Photopea) అని టైప్ చేయండి.  ప్రొఫెషనల్ ఫొటోషాప్ ఎడిటింగ్ టూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో ఫొటోనీ పీఎస్ డీ(PSD), రా(RAW) ఫార్మాట్స్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇమేజ్ రీసైజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి.

ఫోటోర్

ఫోటోర్(fotor) అనే మరో ఫొటో ఎడిటింగ్ వెబ్ సైట్ లో ఫొటోస్ ను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఏఐ టూల్స్, ఏఐ ఇమేజ్ జనరేటర్, ఏఐ ఇమేజ్ ఎడిటర్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు స్కిన్ రీటచ్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇందులో సోషల్ మీడియా టెంప్లేట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా..

ఇక వీటితోపాటు కాన్వా, ఫొటోషాప్ ఎక్స్ ప్రెస్, అడోబీ లైట్ రూట్, పిక్స్ ఆర్ట్, స్నా్ప్ సీడ్ వంటి పలు యాప్స్ లో కూడా ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. కలర్ ఎడిటింగ్ కోసం లైట్ రూమ్, పోస్టర్స్, గ్రాఫిక్ డిజైన్స్ కోసం కాన్వా, ఫిల్టర్స్ కోసం స్నాప్ సీడ్ వంటివి బాగుంటాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి