స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక.. ప్రతీ ఒక్కరూ ప్రొపెషనల్ ఫోటోగ్రాఫర్స్ లా మారిపోతున్నారు. తమ ఫోన్లతోనే అదిరిపోయే ఫోటోలు తీసేస్తున్నారు వినియోగదారులు. చాలా మంది కెమెరా కోసమే ఫోన్ కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు. తమ జీవితంలోని అందమైన క్షణాలను అందులో నిక్షిప్తం చేసుకుంటారు. అయితే, చాలా మంది కెమెరా విషయంలో ఏ ఫోన్ తీసుకుంటే మంచిది అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉత్తమ కెమెరా ఫీచర్ కలిగిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్ లిస్ట్‌ను చూద్దాం. బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉన్న అద్భుతమైన కెమెరా ఫోన్లు ఇవే..
గతేడాది మార్కెట్‌లోకి లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 13.. విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఐఫోన్ 14 మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఐఫోన్ 13 చాలా ఉత్తమంగా భావిస్తున్నారు. ఐఫోన్ 13.. 12 మెగా పిక్సెల్స్, ఆల్ట్రా వైడ్ కెమెరాను అందిస్తోంది. ఈ ఐఫోన్‌లో, వినియోగదారులకు ఫోటోగ్రాఫిక్ స్టైల్, స్మార్ట్ హెచ్‌డిఆర్ 4, నైట్ మోడ్, 4కె డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ రికార్డింగ్ వంటి గొప్ప ఫీచర్లు అందించబడ్డాయి. సెల్ఫీ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Samsung Galaxy S22, S22 Plus మంచి ప్యాకేజీ. ఇది Galaxy S22 అల్ట్రా కంటే మెరుగైన ఆప్షన్. ఈ ఫోన్ మార్కెట్‌లో రూ.51,900కు అందుబాటులో ఉంది. Samsung Galaxy S22 Plus 5G 8GB RAM, 128GB స్టోరేజ్‌తో అన్ని కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12-మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్, 3X ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం జరిగింది.
ఈ ఫోన్ కెమెరా ఫీచర్స్ అదుర్స్ అని చెప్పాలి. వినియోగదారులు విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. ఫోన్ కెమెరా, మంచి పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్, అద్భుతమైన ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఐఫోన్ కెమెరాకు చాలా పోటీని ఇస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ లెన్స్, 48-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యుత్తమ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అద్భుతంగా పని చేస్తుంది. మంచి క్లారిటీతో ఫోటో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని కెమెరా ప్రధాన లెన్స్ 50 మెగాపిక్సెల్స్, హ్యాండ్‌సెట్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ లెన్స్‌తో వస్తుంది. ఈ ఫోన్ సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..