ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా, అయితే ఈ ఫీచర్ల గురించి తెలుసుకుంటే మీ పని చాలా సులువు అవుతుంది..

| Edited By: Ravi Kiran

Mar 11, 2023 | 8:00 AM

మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే, ఆండ్రాయిడ్ సిస్టంలో అనేక అద్భుతమైన ఫీచర్‌లు ఉన్నాయని మీకు తెలుసా. నిజానికి తమ స్మార్ట్ ఫోన్లో ఏమేం ఫీచర్లు ఉన్నాయో చాలా మందికి తెలియవు.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా, అయితే ఈ ఫీచర్ల గురించి తెలుసుకుంటే మీ పని చాలా సులువు అవుతుంది..
Android
Follow us on

మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే, ఆండ్రాయిడ్ సిస్టంలో అనేక అద్భుతమైన ఫీచర్‌లు ఉన్నాయని మీకు తెలుసా. నిజానికి తమ స్మార్ట్ ఫోన్లో ఏమేం ఫీచర్లు ఉన్నాయో చాలా మందికి తెలియవు. కొన్ని యాప్స్ మినహా వారు ఎక్కువగా ఫీచర్లను వాడుకోరు. దీంతో అవసరం అయినప్పుడు వారు ఇబ్బంది పడుతుంటారు. అందుకే అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, కొన్ని ఫీచర్లను మేము మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓ లుక్కేయండి.

ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది ప్రపంచంలోని దాదాపు 90 శాతం ఫోన్లలో డామినేట్ చేస్తోంద. ఐఫోన్ మినహా అన్ని ఫోన్లలో దాదాపుగా యాండ్రాయిడ్ మాత్రమే ఉంటుంది. అందుకే ఈ ఫీచర్లు మీరు తెలుసుకుంటే మీ అనుభవం మెరుగుపరచడంలో సహాయపతుుంది. మీ Android స్మార్ట్‌ఫోన్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. మీరు కాల్‌లు,సందేశాల కోసం మీ ఫోన్‌ని ఉపయోగించినప్పటికీ, ఈ ఫీచర్‌లు మీ పనులను సులభంగా, వేగంగా పూర్తి చేయడంలో సహాయపడతాయి. కాబట్టి, ఆండ్రాయిడ్ వినియోగదారులు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

1. వన్ హ్యాండ్ మోడ్:

ఇవి కూడా చదవండి

మీరు మీ ఫోన్‌ను పోర్ట్రెయిట్ ఓరియంటేషన్‌లో ఒక చేత్తో ఉపయోగించినప్పుడు, స్క్రీన్ పైభాగంలో సగాన్ని తగ్గించడం కోసం మీరు వన్ హ్యాండ్ మోడ్‌ని ఉపయోగించవచ్చు, తద్వారా మీ బొటనవేలు సులభంగా చేరుకోవచ్చు. ఫోన్‌ని ఒక చేత్తో ఉపయోగిస్తున్నప్పుడు కేవలం స్వైప్‌తో మొత్తం ఇంటర్‌ఫేస్ క్రిందికి పడిపోయినప్పుడు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

2. స్ప్లిట్ స్క్రీన్:

మీరు మల్టీ టాస్కర్ అయితే, స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ లైఫ్‌సేవర్ కావచ్చు. ప్రతి ఒక్కరూ రెండు స్మార్ట్‌ఫోన్‌లను మెయిన్ టెయిన్ చేయలేరు. అప్పుడు స్ప్లిట్ స్క్రీన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, మీ ఫోన్ స్క్రీన్ రెండు విభజించబడి, రెండు వేర్వేరు యాప్‌లను చూపుతుంది.

3. ట్రాన్స్ లేటర్ ఫీచర్:

మీరు ఎప్పుడైనా ఒక విదేశాలకు వెళితే, మీ Android ఫోన్‌లో కెమెరా యాప్‌ ద్వారా కనిపించిన టెక్స్ట్ ఫోటోలను క్లిక్ చేయడం ద్వారా అందులోని టెక్స్ట్‌లను అనువదించుకొని, అర్థం చేసుకోవచ్చు.

4. లైవ్ ట్రాన్స్ క్రైబ్:

మీ ఫోన్‌లోని వాయిస్ ను టెక్ట్స్ గా మారుస్తుంది. లైవ్ ట్రాన్స్ క్రైబ్ మోడ్ ఆన్ చేస్తే రియల్ టైమ్ ఆడియో క్యాప్షన్‌లను టెక్ట్స్ గా మార్చేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఇది వినికిడి సమస్య ఉన్న వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుంది.

5. స్మార్ట్ లాక్:

Smart Lock ఫీచర్‌ మీరు సురక్షితం అని భావించే ఇల్లు లాంటి ప్రదేశాలలో మీ Android ఫోన్ అన్ లాక్ చేస్తుంది. తద్వారా మీరు ప్రతీసారి అన్ లాక్ చేసే అవసరం ఉండదు. Smart Lock ఫీచర్ ద్వారా మీరు ఉన్న స్థానాన్ని గుర్తించి, మీ ఫోన్ యాక్సెస్ లాక్‌ని ఆటోమేటిగ్గా వేస్తుంది. మీ స్థానం మారిన వెంటనే, ఈ లాక్‌ పడిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..