AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేసింగ్ లవర్స్ కోసం స్పెషల్ ఎడిషన్! అదిరే కలర్స్, లుక్​తో Aprilia RS 660.. స్పెషాలిటీస్​ ఇవే

ప్రముఖ ఇటాలియన్ బైక్ తయారీ సంస్థ Aprilia తన స్పోర్ట్స్ బైక్ RS 660కు ప్రత్యేక ఎడిషన్‌ను పరిచయం చేసింది. Aprilia RS 660 Phillip Island Tribute Edition పేరుతో తీసుకొచ్చిన ఈ మోడల్‌ ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్‌తో సంస్థకు ఉన్న రేసింగ్ అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. ప్రత్యేకమైన కలర్ కాంబినేషన్, రేసింగ్ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ బైక్‌ను ఇటలీలోని మిలన్‌లో జరిగే EICMA 2026 ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు.

రేసింగ్ లవర్స్ కోసం స్పెషల్ ఎడిషన్! అదిరే కలర్స్, లుక్​తో Aprilia RS 660.. స్పెషాలిటీస్​ ఇవే
Aprilia Rs 660 Phillip Island Edition
Nikhil
|

Updated on: Oct 28, 2026 | 6:30 AM

Share

స్పోర్ట్స్ బైక్‌లను ఇష్టపడే వారిని ఆకట్టుకునేలా Aprilia RS 660 Phillip Island Editionను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్టాండర్డ్ మోడల్‌లోని ఇంజిన్, మెకానికల్ సెటప్‌ను కొనసాగిస్తూనే.. లుక్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక గుర్తింపును అందించారు. ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్‌తో ముడిపడిన రేసింగ్ చరిత్రకు నివాళిగా రూపొందించిన ఈ ఎడిషన్‌కు సంబంధించిన ధర, విక్రయాల వివరాలు ఇంకా వెల్లడించలేదు.

రేసింగ్ గ్రాఫిక్స్‌తో అదిరిపోయే లుక్

Aprilia RS 660 Phillip Island Tribute Editionలో వైట్ కలర్ బేస్‌గా ఉపయోగించారు. సైడ్ ప్యానెల్స్, వెనుక భాగంలో గ్రీన్ ఫినిషింగ్ ఇవ్వగా.. రెడ్ కలర్ వీల్ రిమ్స్ స్పోర్టీ లుక్‌ను మరింత పెంచుతున్నాయి. ఈ కలర్ కాంబినేషన్ ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్ లోగో నుంచి ప్రేరణ పొందింది. బైక్ సైడ్ ప్యానెల్స్‌పై సర్క్యూట్ లేఅవుట్, దాని పేరు, చెకర్డ్ ఫ్లాగ్ గ్రాఫిక్స్‌ను ఏర్పాటు చేశారు.

ఫ్యూయల్ ట్యాంక్‌పై ఫిలిప్ ఐలాండ్‌లో Aprilia సాధించిన రేసింగ్ విజయాలను గుర్తుచేసే బ్యాడ్జ్‌ను అందించారు. స్టీరింగ్ హెడ్ ప్లేట్‌పై ప్రత్యేక సీరియల్ నంబర్‌ను ఉంచారు. వెనుక ప్యాసింజర్ సీటు స్థానంలో ప్రత్యేక సీట్ కవర్‌ను అమర్చారు. ఈ మార్పులన్నీ బైక్‌కు ప్రత్యేకమైన రేసింగ్ గుర్తింపును అందిస్తున్నాయి.

660cc ఇంజిన్..

ఈ స్పెషల్ ఎడిషన్‌లో స్టాండర్డ్ Aprilia RS 660లోని 660cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఈ ఇంజిన్ 10,400rpm వద్ద 105bhp గరిష్ఠ పవర్‌ను, 8,400rpm వద్ద 70Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇంజిన్ పనితీరులో ప్రత్యేకమైన మార్పులు చేసినట్లు కంపెనీ వెల్లడించలేదు. కాబట్టి ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ డిజైన్, కలర్స్, ప్రత్యేక గ్రాఫిక్సే.

ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్ Aprilia రేసింగ్ చరిత్రలో కీలకమైన వేదికగా నిలిచింది. World Superbike Championshipలో RSV4 సాధించిన విజయాలతో పాటు, వివిధ MotoGP విభాగాల్లో ఈ సర్క్యూట్‌పై సంస్థ పలు విజయాలను నమోదు చేసింది. గత ఏడాది Australian Grand Prixలో రౌల్ ఫెర్నాండెజ్ సాధించిన MotoGP విజయం, ప్రపంచ మోటార్‌సైకిల్ ఛాంపియన్‌షిప్‌లో Apriliaకు 300వ విజయంగా నిలిచింది.

2026 సీజన్ తర్వాత MotoGP క్యాలెండర్ నుంచి ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్ తప్పుకోనుండటంతో ఈ ట్రిబ్యూట్ ఎడిషన్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. 2027 నుంచి అడిలైడ్ స్ట్రీట్ సర్క్యూట్ ఈ స్థానాన్ని భర్తీ చేయనుంది. అయితే Aprilia RS 660 Phillip Island Edition ధర, ఉత్పత్తి చేయనున్న బైక్‌ల సంఖ్య, విక్రయించనున్న దేశాల వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Follow Us