Apple Smart Watch: వ్యక్తి ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

|

Feb 21, 2023 | 2:04 PM

మనతో పాటు ఎవరూ లేని సమయాల్లో ఏదైనా ప్రమాదం వాటిల్లితే మనల్ని మనం రక్షించుకోవల్సిన పరిస్థితి లేకపోతే.. మన పరిస్థితి ఏమిటి అంటే సమాధానం ఉండదు. సరిగ్గా అలాంటి సమయంలోనే మనతో ఎప్పుడూ ఉండే కొన్ని వస్తువులు మనల్ని రక్షిస్తాయి.

Apple Smart Watch: వ్యక్తి ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..
Apple Watch 7
Follow us on

సాంకేతికత రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని రంగాల్లోనూ కొత్త వస్తువులు ఆధునిక సాంకేతికతతో వస్తున్నాయి. అవి మనిషి పనిని సులువు చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కాపాడుతున్నాయి. ఒక్కోసారి మనకు అనుకోకుండా జరిగే ప్రమాదాలనుంచి మనల్ని.. మనతో ఉండే వస్తువులే రక్షిస్తాయని మనం ఊహించను కూడా ఊహించం. మనతో పాటు ఎవరూ లేని సమయాల్లో ఏదైనా ప్రమాదం వాటిల్లితే మనల్ని మనం రక్షించుకోవల్సిన పరిస్థితి లేకపోతే.. మన పరిస్థితి ఏమిటి అంటే సమాధానం ఉండదు. సరిగ్గా అలాంటి సమయంలోనే మనతో ఎప్పుడూ ఉండే కొన్ని వస్తువులు మనల్ని రక్షిస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి తాను రోజు ధరించే యాపిల్ వాచ్ తన ప్రాణాలు కాపాడిందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను తన రెడ్డిట్ పోస్ట్ లో వెల్లడించారు. ‘నా యాపిల్ వాచ్ 7 నా ప్రాణాన్ని కాపాడింది’ అంటూ క్యాప్షన్ పెట్టి తనకు ఎదురైన అనుభవాన్ని, వాచ్ తన ప్రాణాన్ని ఎలా కాపాడిందన్న విషయాలను వివరించారు.

అలసిపోయి పడుకొంటే అలర్ట్ చేసింది..

ఇక వారం ముందు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన రెడ్డిట్ పోస్ట్ లో ఆయన వివరిస్తూ.. ఆ రోజు తాను బాగా అలసిపోయానని, మధ్యాహ్నం భోజనం చేసి అలాగే బెడ్ పై తలవాల్చి నిద్రపోయానని చెప్పారు. తిరిగే లేచే సరికి తన యాపిల్ స్మార్ట్ వాచ్ లో దాదాపు పది నోటిఫికేషన్లు ఉన్నట్లు గుర్తించానన్నారు. అవన్నీ కూడా తన పల్స్ రేటుకు సంబంధించినవేనని.. బాగా హై లెవెల్లో పల్స్ రేట్ ఉన్నట్లు అలర్ట్ చేసినట్టు వివరించారు. దానిని చూసుకొని తనను తాను రిలాక్స్ చేసుకొని, కాస్త అటుఇటు తిరిగినా ఫలితం లేకపోవడంతో స్మార్ట్ వాచ్ వీడియోను తన డాక్టర్ కి పంపానని చెప్పారు. దానిలో ఆయన తన స్మార్ట్ లోని డేటా ను తనిఖీ చేసి వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ 911కి కాల్ చేసాడని వివరించారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లగా.. అది అంతర్గత రక్తస్రావం కారణంగా జరిగిందని నిర్ధారించారన్నారు. వాస్తవానికి అది గుండె పోటని.. దీనిని జీఐ బ్లీడింగ్ అని కూడా అంటారని వివరించారు. ఆ సమయంలో తాను తన వాచ్ కి థ్యాంక్స్ చెప్పాడని పేర్కొన్నారు. తన యాపిల్ స్మార్ట్ వాచ్ 7 తన ప్రాణాలు కాపాడిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..