iPhone 16: ఐఫోన్ 16లో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. అండర్‌ వాటర్‌ మోడ్‌ పేరుతో..

|

Feb 08, 2024 | 11:31 PM

ఈ ఏడాది చివరినాటికి యాపిల్‌ నుంచి ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్‌ కానున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో అందుబాటులోకి రానున్న ఫీచర్లపై ఆసక్తినెలకొంది. గత సిరీస్‌లతో పోల్చితే ఐఫోన్‌ 16లో మరింత ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌...

iPhone 16: ఐఫోన్ 16లో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. అండర్‌ వాటర్‌ మోడ్‌ పేరుతో..
Apple
Follow us on

యాపిల్‌ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాపిల్‌ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే చాలు టెక్‌ మార్కెట్‌లో ఒక బజ్‌ ఏర్పడుతుంది. ఇక వినియోగదారుల అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా యాపిల్ తన ప్రొడక్ట్స్‌లో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్ 16 సిరీస్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది యాపిల్‌.

ఈ ఏడాది చివరినాటికి యాపిల్‌ నుంచి ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్‌ కానున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో అందుబాటులోకి రానున్న ఫీచర్లపై ఆసక్తినెలకొంది. గత సిరీస్‌లతో పోల్చితే ఐఫోన్‌ 16లో మరింత ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌ అండర్‌ వాటర్‌ మోడ్‌ అనే ఓ ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్‌ ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో పేటెంట్‌లో అండర్‌ వాటర్‌ మోడ్‌ ఫీచర్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

అయితే యాపిల్ ఈ టెక్నాలజీని ఐఫోన్‌ 16 సిరీస్‌లో కచ్చితంగా తీసుకొస్తుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ అండర్‌ వాటర్ మోడ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే యూజర్లు నీటి లోతులో కూడా ఫోన్‌ను ఆపరేట్‌ చేసుకోవచ్చు. కేవలం ఆపరేట్ మాత్రమే కాకుండా.. నీటి అడుగు భాగంలో కూడా మంచి క్లారిటీతో కూడిన ఫొటోలు తీసుకోవచ్చు. నీటి అడుగు భాగంలో ఫోన్‌ టచ్‌ పనిచేయదు కాబట్టి, కెమెరా ఆపరేటింగ్‌కు ప్రత్యేక బటన్‌ను కేటాయించనున్నారు.

నీటిలో ఫొటోలు తీసుకోవాలనుకుంటే ముందుగా ఐఫోన్‌లో అండర్‌ వాటర్ మోడ్‌ను ఆన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కస్టమర్లు నీటి అడుగున కెమెరాను ఉపయోగించగలరు. ఇందుకోసం స్క్రీన్‌ను టచ్‌ చేయడానికి బదులుగా, వాల్యూమ్ రాకర్ బటన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా నీటి అడుగు భాగంలో కూడా మంచి క్లారిటీతో ఉన్న చిత్రాలను క్లిక్‌ మనిపించవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..