Apple iPhone: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఇంకెన్నో యాపిల్ ప్రొడక్ట్స్ మీకోసం.. లాంచ్ ఈవెంట్ ఎప్పుడంటే..

|

Sep 06, 2022 | 8:20 PM

ఐఫోన్ వాడాలనుకునే మెబైల్ ప్రియుల కోసం సరికొత్త ఫీచర్స్ తో మరో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మీ ముందుకొచ్చేస్తోంది. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ లాంచ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఐఫోన్ 14 సిరీస్‌ ( iPhone 14 series ) తో పాటు మరిన్ని..

Apple iPhone: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఇంకెన్నో యాపిల్ ప్రొడక్ట్స్ మీకోసం.. లాంచ్ ఈవెంట్ ఎప్పుడంటే..
Iphone 14
Follow us on

Apple iPhone:ఐఫోన్ వాడాలనుకునే మెబైల్ ప్రియుల కోసం సరికొత్త ఫీచర్స్ తో మరో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మీ ముందుకొచ్చేస్తోంది. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ లాంచ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఐఫోన్ 14 సిరీస్‌ ( iPhone 14 series ) తో పాటు మరిన్ని ప్రొడక్టులను సెప్టెంబర్ 7వ తేదీన జరిగే ఈవెంట్‌లో యాపిల్ లాంచ్ చేయనుంది. ముఖ్యంగా ఐఫోన్ 14 సిరీస్ కోసం చాలా మంది ఇప్పటికే వేచిచూస్తున్నారు. ఐఫోన్ 13 సిరీస్‌తో పోలిస్తే 14 సిరీస్ మొబైళ్లు ఊహించని అప్‌గ్రేడ్స్‌తో వస్తాయని ఇప్పటికే చాలా లీక్‌లు వచ్చాయి. దీంతో ఐఫోన్ 14 సిరీస్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14 , ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro max) రానున్నాయి. యాపిల్ ఫార్ ఔట్ లాంచ్ ఈవెంట్ ఇండియన్ టైం ప్రకారం బుధవారం రాత్రి 10.30 గంటలకు మొదలవుతుంది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌, యూట్యూబ్ చానెల్‌లో ఈ ఈవెంట్ ను లైవ్ చూడొచ్చు. ఐఫోన్ 14 సిరీస్‌పై మరిన్ని అంచనాలను ఓసారి తెలుసుకుందాం..

ధరలో ట్విస్ట్: ఐఫోన్ 14 ధర.. ఐఫోన్ 13 లాంచ్ ధర కంటే తక్కువగా ఉంటుందని ఓ అంచనా ఉంది. గత సంవత్సరం లాంచ్ అయిన సమయంలో ఐఫోన్ 13 ప్రారంభ ధర అమెరికాలో 799 డాలర్లుగా ఉంది. అయితే ఐఫోన్ 14 (128 జీబీ మోడల్)‌ను యాపిల్ ఈసారి 749 డాలర్లకే అంటే భారత్ లో సుమారు రూ.60వేలు ఉండొచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఐఫోన్ 14 మ్యాక్స్ ధర 849 డాలర్లు ఉండే అవకాశం ఉంది.

లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్ ధరలను యాపిల్ అధికారికంగా ప్రకటించనుంది. అమెరికాతో పోలిస్తే ఇండియాకు వచ్చేసరికి ఐఫోన్‌ల ధరలు కాస్త ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 14 సిరీస్ 6.1 ఇంచులు, ఐఫోన్ 14 మ్యాక్స్ 6.7 ఇంచులు, ఐఫోన్ 14 ప్రో 6.1 ఇంచులు, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 6.7 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కెమెరా చాలా అప్‌గ్రేడ్లతో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మొదటిసారి 48 మెగాపిక్సెల్ కెమెరాను యాపిల్ అందిస్తుందని తెలుస్తోంది. iPhone 14 Pro మోడల్స్ వెనుక 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. iPhone 14 Series మోడల్స్ శాటిలైట్ కనెక్టివిటీ (Satellite connectivity) సపోర్ట్‌తో రానున్నాయి. సెల్యూలర్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా కాల్స్, మెసేజ్‌లు చేసుకునే అవకాశం ఈసిరీస్ ఫోన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అమెరికాలో ఈ ఫీచర్ పని చేసే అవకాశం ఉంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో యాపిల్ వాచ్‌ సిరీస్ 8, కొత్త ఐప్యాడ్ మోడల్, రెండో జనరేషన్ ఎయిర్‌పోడ్స్ ప్రో, కొత్త మ్యాక్‌బుక్‌ను కూడా యాపిల్ లాంచ్ చేయనుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం చూడండి..