అతిపెద్ద గ్రహాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్..
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భారీ గ్రహాన్ని కనుగొంది. సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఆ గ్రహం బృహస్పతి కన్నా పెద్ద సైజులో ఉంది. సౌర వ్యవస్థ అవతల కొత్త గ్రహం చేరికతో ఎక్సోప్లానెట్స్ సంఖ్య పెరిగింది.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భారీ గ్రహాన్ని కనుగొంది. సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఆ గ్రహం బృహస్పతి కన్నా పెద్ద సైజులో ఉంది. సౌర వ్యవస్థ అవతల కొత్త గ్రహం చేరికతో ఎక్సోప్లానెట్స్ సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట ఉన్న గ్రహాల సంఖ్య దాదాపు 5 వేలు దాటింది. అయితే ఈ కొత్త గ్రహాన్ని నాలుగు రకాల లైట్ ఫిల్టర్లలో పరీక్షించారు. చాలా శక్తివంతంగా ఈ గ్రహం వెలిగిపోతోంది. సోలార్ సిస్టమ్ బయట ఎలా ఓ విశిష్ట ప్రదేశం ఉందో ఈ గ్రహాన్ని వీక్షిస్తే తెలుస్తుందన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న గ్రహాన్ని హెచ్ఐపీ 65426బీగా నామకరణం చేశారు. ఇది జూపిటర్ గ్రహం కన్నా సుమారు 12 రెట్లు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ గ్రహం ఏర్పడి దాదాపు 15 నుంచి 20 మిలియన్ల సంవత్సరాలు అయి ఉంటుందని అనుకుంటున్నారు. నాసా తన బ్లాగ్‌లో కొత్త ప్లానెట్‌కు సంబంధించిన చిత్రాలను రిలీజ్ చేసింది. వాస్తవానికి ఈ గ్రహాన్ని 2017లో తొలిసారి గుర్తించారు. కానీ దానికి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు వెబ్ టెలిస్కోప్‌తో ఆ ప్లానెట్‌కు చెందిన కొత్త వివరాలను సేకరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ వింగ్స్ తిని బోన్స్ డెలివరీ చేసిన బాయ్ !! అందులో ఓ లెటర్ కూడా..
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

