జాక్‌పాట్: గూగుల్‌పే స్క్రాచ్ కార్డుతో లక్ష రివార్డు

అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు పుట్టుకతోనే దృష్టవంతులుగా పేరుపోతారు. మరికొందరు నక్కతొక్కారేమో అన్నట్లుగా అనుకోని అదృష్టం కలిసివస్తుంది. అలాగే అనంతపురం జిల్లాలో ఓ యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది.

జాక్‌పాట్: గూగుల్‌పే స్క్రాచ్ కార్డుతో లక్ష రివార్డు
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 29, 2020 | 2:03 PM

అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు పుట్టుకతోనే అదృష్టవంతులుగా పేరుపోతారు. మరికొందరు నక్కతొక్కారేమో అన్నట్లుగా అనుకోని అదృష్టం కలిసివస్తుంది. అలాగే అనంతపురం జిల్లాలో ఓ యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో స్క్రాచ్ కార్డు ద్వారా రూ.లక్ష రివార్డ్ వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది.

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్‌ అనే వ్యక్తి స్థానికంగా ఓ ఫొటో స్టూడియో నడుపుకుంటూ జీవనోపాధిని పొందుతున్నాడు. అయితే, శుక్రవారం తన స్నేహితుడికి నగదు పంపించాడు. గూగుల్ పే యాప్ ద్వారా రూ.3 వేలు బదిలీ చేశాడు. ఆ వెంటనే అతనికి ఓ స్క్రాచ్ కార్డు వచ్చింది. ఎప్పటిలాగే అతడు సాధాసీదాగా స్క్రాచ్ చేశాడు. కానీ దాన్ని చూసిన వెంటనే తాను చూసిన నంబర్ నమ్మలేకపోయాడు. కొద్దిసేపటికే తన అకౌంట్లో రూ. 1,00,107 జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. తనకు వచ్చిన రివార్డు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజమా కాదా అని తేరుకోవడానికే కొంత సమయం పట్టింది. ఆ ఆఫర్ చూసిన అతని ఆనందానికి అవధులేకుండా పోయాయి. లక్ష రావడంతో సూర్య ఉబ్బితబ్బిబవుతున్నాడు. దీన్ని ఇంకా తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. లక్కీగా వచ్చిన రూ.లక్షతో గోల్డ్‌ లోన్‌ తీరిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసిన వారంతా సూర్యప్రకాశ్‌ అదృష్టంపై చర్చించుకుంటున్నారు. జిల్లాతో పాటుగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!