
ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది గుండె సంబంధిత వ్యాధులు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు ముఖ్య కారణం ఈ గుండె సంబంధిత వ్యాధులను ముందే గుర్తించలేక పోవడం. ఈ జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించలేకపోవడంతో అవి తీవ్రతరమై ప్రాణాలు పోయే పరిస్థితికి చేరుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన లండన్ శాస్త్రవేత్తలు.. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు.. సరికొత్త టెక్నాలజీతో AI-ఆధారిత స్టెతస్కోప్‌ను రూపొందించారు. ఈ స్టెతస్కోప్ ద్వారా అతి ప్రమాదకరమైన గుండె జబ్బులను కేవలం 15 సెకన్లలోనే కనిపెట్టవచ్చని వారు చెబుతున్నారు.
ఈ AI స్టెతస్కోప్‌ను ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ పరిశోధకులు UK పరిశోధన ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. సాధారణంగా వైద్యులు ఉపయోగించే స్టెతస్కోప్‌ను అప్‌గ్రేడ్ చేసి ఈ కొత్త AI స్టెతస్కోప్ ను తయారుచేశారు. ఇది ఒక ప్లేయింగ్ కార్డ్ సైజులో ఉంటుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.