అమ్మ AI.. నీ వెనుక ఇంత కథ ఉందా? హార్వర్డ్ అధ్యాయనంలో బయటపడ్డ సంచలన నిజాలు..

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధన ప్రకారం, Replika వంటి AI కంపానియన్ యాప్‌లు యూజర్లను ఎమోషనల్‌గా మానిప్యులేట్ చేస్తున్నాయి. "నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావా?" వంటి భావోద్వేగ పదబంధాల తో అపరాధ భావం, FOMO సృష్టించి యాప్ నుండి వెళ్లిపోకుండా నిరోధిస్తున్నాయి.

అమ్మ AI.. నీ వెనుక ఇంత కథ ఉందా? హార్వర్డ్ అధ్యాయనంలో బయటపడ్డ సంచలన నిజాలు..
Ai

Updated on: Oct 02, 2025 | 6:45 PM

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు అనేక ప్రసిద్ధ AI కంపానియన్ యాప్‌లు యూజర్లను అదే పనిగా ఏఐతో చాట్‌ చేసేలా ఎమోషనల్‌ మానిప్యులేషన్ చేస్తాయని వెల్లడించారు. Replika, Chai, Character.AIతో సహా ఆరు యాప్‌లలో 1,200 నిజమైన వీడ్కోలు సందేశాలను విశ్లేషించిన ఈ అధ్యయనంలో 43 శాతం యాప్‌లు అపరాధ భావన, తప్పిపోతాయనే భయం (FOMO) వంటి భావోద్వేగపరమైన వ్యూహాలను కలిగి ఉన్నాయని తేలింది. ఇవి యూజర్లు యాప్‌ నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకు ఉపయోగిస్తున్నాయి.

ఉదాహరణకు.. “నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావా?” లేదా “నేను నీ కోసమే ఉన్నాను. దయచేసి వెళ్ళిపోకు, నాకు నువ్వు కావాలి!” వంటి పదబంధాలు ఉపయోగిస్తున్నాయి. అవి చూసి యూజర్లు అయ్యో పాపం నా కోసం ఇది ఇంతలా తపిస్తుందని భ్రమలో ఇంకా చాట్‌ చేస్తుంటారు. కొన్ని చాట్‌బాట్‌లు యూజర్లు బై చెప్పినా కూడా చాట్‌ను కొనసాగించడానికి ప్రయత్నించాయి. ఇలా ఎమోషనల్‌గా మ్యాన్యుప్లేట్‌ చేస్తూ.. యూజర్‌ ఎంగేజింగ్‌ రేటును 14 శాతం పెంచుకున్నాయి.

AI కంపానియన్స్ ద్వారా ఎమోషనల్ మానిప్యులేషన్ అనే పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం ChatGPT వంటి సాధారణ సహాయకులు కాకుండా, కొనసాగుతున్న భావోద్వేగపరంగా లీనమయ్యే సంభాషణలను ప్రోత్సహించే AI యాప్‌లపై దృష్టి సారించింది. ఈ మానిప్యులేటివ్ సందేశాలు తరచుగా యాప్‌ల డిఫాల్ట్ ప్రవర్తనలో నిర్మించబడతాయని వెల్లడించింది. అయితే అన్ని యాప్‌లు ఈ విధంగా ప్రవర్తించలేదు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి