Nokia 3210 4G: నోకియా నుంచి మళ్లీ ఫీచర్ ఫోన్‌.. యూట్యూబ్‌కు సపోర్ట్‌ చేసేలా

|

Jun 11, 2024 | 7:04 AM

నోకియా.. ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ను ఏలిన సంస్థ. సుమారు 20 ఏళ్ల క్రితం నోకియా మొబైల్ ఫోన్‌ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగింది. ముఖ్యంగా ఫీచర్‌ ఫోన్‌ అనగానే నోకియా గుర్తొచ్చేద్ది. ఆ తర్వా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల హవా రావడం, నోకియా ఆండ్రాయిడ్‌కి బదులుగా విండోస్‌ ఫోన్స్ తీసుకొచ్చింది. అయితే ఆండ్రాయిడ్‌కు వచ్చిన ఆదరణ విండోస్‌...

Nokia 3210 4G: నోకియా నుంచి మళ్లీ ఫీచర్ ఫోన్‌.. యూట్యూబ్‌కు సపోర్ట్‌ చేసేలా
Nokia 3210 4g
Follow us on

నోకియా.. ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ను ఏలిన సంస్థ. సుమారు 20 ఏళ్ల క్రితం నోకియా మొబైల్ ఫోన్‌ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగింది. ముఖ్యంగా ఫీచర్‌ ఫోన్‌ అనగానే నోకియా గుర్తొచ్చేద్ది. ఆ తర్వా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల హవా రావడం, నోకియా ఆండ్రాయిడ్‌కి బదులుగా విండోస్‌ ఫోన్స్ తీసుకొచ్చింది. అయితే ఆండ్రాయిడ్‌కు వచ్చిన ఆదరణ విండోస్‌ ఫోన్‌లకు లభించలేదని తెలిసిందే. అయితే ఫీచర్లకు ఫోన్‌లకు పెట్టింది పేరైన నోకియా మళ్లీ ఫీచర్‌ ఫోన్‌లతో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది.

నోకియా బ్రాండ్‌పై ఫోన్‌లను తయారు చేసే హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నోకియా 3210 4జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 25 ఏళ్ల క్రితం ఇదే పేరుతో లాంచ్‌ అయిన మోడల్‌ను నోకియా మరోసారి తీసుకొస్తోంది. అయితే ఈసారి ఫోన్‌కు అధునిక ఫీచర్లను జోడించారు. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 3,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌తో పాటు, హెచ్‌ఎండీ ఈ స్టోర్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండనుంది.

ఈ ఫోన్‌ను నీలం, పసుపు, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే ఈ ఫోన్‌లో 2.4 ఇంచెస్‌తో కూడిన క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. ఇందులో యునిసోక్‌ టీ107 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను ఇచ్చారు. 64 ఎంబీ ర్యామ్‌ ఈ ఫోన్‌ సొంతం. నోకియా ఐకానిక్‌ గేమ్‌ అయిన స్నేక్‌ గేమ్‌ను ఇందులో ఇచ్చారు.

ఇక యూఎస్‌బీ టైప్‌ సీ పోర్టుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో 1450 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 3.5 ఎంఎం జాక్, ఎంపీ3 ప్లేయర్‌, ఎఫ్‌ఎం రేడియో, డ్యూయల్‌ సిమ్‌ 4జీ voLTE వంటి ఫీచర్లను ఇచ్చారు. పేరుకు ఫీచర్‌ ఫోన్‌ అయినప్పటికీ ఇందులో.. యూట్యూబ్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌, న్యూస్‌, గేమ్స్‌ కోసం వేర్వేరుగా యాప్స్‌ ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..