AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Hair: తెల్ల జుట్టుకు ఒత్తిడి కూడా ఓ కారణమే.. తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చుకోవచ్చని మీకు తెలుసా.?

White Hair: సాధారణంగా మనం బయటకు కనిపించే సమస్యలనే అనారోగ్య సమస్యలుగా భావిస్తుంటాయి. అయితే శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మానసిక సమస్యల గురించి పట్టించుకోము. ముఖ్యంగా ఒత్తిడి వల్ల...

White Hair: తెల్ల జుట్టుకు ఒత్తిడి కూడా ఓ కారణమే.. తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చుకోవచ్చని మీకు తెలుసా.?
White Hair Stress
Narender Vaitla
|

Updated on: Jul 26, 2021 | 9:14 AM

Share

White Hair: సాధారణంగా మనం బయటకు కనిపించే సమస్యలనే అనారోగ్య సమస్యలుగా భావిస్తుంటాయి. అయితే శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మానసిక సమస్యల గురించి పట్టించుకోము. ముఖ్యంగా ఒత్తిడి వల్ల కలిగే నష్టాల గురించి పెద్దగా మనలో చాలా మందికి అవగాహన కూడా ఉండి ఉండదు. అయితే ఒత్తిడి మనిషిపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో దాదాపు అన్ని రోగాలకు మానసిక సమస్యలే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే జుట్టు తెల్లగా మారడానికి కూడా ఒత్తిడి ఓ కారణమని మీకు తెలుసా? విపరీతమైన ఒత్తిడి జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

న్యూయార్క్‌లోకి కొలంబియా యూనివర్సిటీకి ఇర్వింగ్ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. పలువురిపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. ఒత్తిడి కారణంగా తల వెంట్రుకలు తెలుపు రంగులోకి మారతాయని తమ పరిశోధనల్లో వెల్లడైందని చెప్పుకొచ్చారు. తలపై జుట్టు రంటు మారితే శరీరంలో దాదాపు 300 రకలా ప్రోటీన్లు మారుతాయని పరిశోధకులు వివరించారు. తీవ్రమైవన ఒత్తిడి, ఆందోళన కారణంగా కార్టిసాల్‌ అనే హార్మోన్‌ పెద్ద ఎత్తున విడుదలవుతుందని, ఇది జుట్టు రంగు మారడంలో కారణంగా మారుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలితే కోల్పోయిన జుట్టు రంగును తిరిగి పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం శాస్ర్తవేత్తలు 9 నుంచి 65 ఏళ్లకు చెందిన 14 మంది ఆరోగ్యవంతుల నుంచి 397 వెంట్రుకలను సేకరించి వాటిపై పరిశోధనలు జరిపారు. వీరిలో కొన్ని నెలలుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిలో జుట్టు రంగు మారడాన్ని గుర్తించారు. అలాగే ఒత్తిడి తగ్గిన తర్వాత అంటే విహారయాత్రలకు వెళ్లడం లేదా తమకున్న టెన్షన్స్‌ తగ్గిన తర్వాత తిరిగి నల్లటి జుట్టు రావడం గమనించారు. అయితే తెల్లగా మారిన జుట్టు రంగు మారడం అంటే కొత్తగా పుట్టుకొచ్చే వెంట్రుకల మొదల్ల నుంచి రంగు మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటూ, మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటే రంగు మారిన మీ జుట్టు మళ్లీ పాత స్థితిలోకి చేరుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

Also Read: Camera For Blind: అంధుల కోసం ప్రత్యేక కెమెరా రూపొందించిన అమెరికా శాస్ర్తవేత్తలు.. ముందుగానే అలర్ట్‌ చేసే వ్యవస్థ.

Smartphone: మీ పాత ఫోన్‌ వేరే వ్యక్తులకు అమ్మేస్తున్నారా..? అయితే ఇది తప్పనిసరిగా చేయాల్సిందే.. ఎందుకంటే..!

Clubhouse Hack: అమ్మకానికి 38 కోట్ల మంది యూజర్ల ఫోన్‌ నెంబర్లు.. డార్క్‌ వెబ్‌లో క్లబ్‌హౌజ్‌ యూజర్ల డేటా..