JIO 5G Phone: దీపావళి నాటికి జియో 5జీ ఫోన్‌.? నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఫీచర్లు, ధర..

ప్రస్తుతం జియో 5జీ స్మార్ట్ ఫోన్‌పై చర్చ నడుస్తోంది. తాజాగా ఈ ఫోన్‌ గురించి నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు జియో గంగా అనే కోడ్‌ నేమ్‌గా పిలవనుందని సమాచారం. దీపావళి నాటికి...

JIO 5G Phone: దీపావళి నాటికి జియో 5జీ ఫోన్‌.? నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఫీచర్లు, ధర..
Representative Image

Updated on: Oct 01, 2022 | 3:36 PM

దేశ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. శనివారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే 5జీ స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేసి వారు తమ సిమ్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు 5జీ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి జియో స్మార్ట్‌ఫోన్‌పై పడింది. దేశంలో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జియో తక్కువ బడ్జెట్‌లో 4జీ సపోర్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ప్రస్తుతం జియో 5జీ స్మార్ట్ ఫోన్‌పై చర్చ నడుస్తోంది. తాజాగా ఈ ఫోన్‌ గురించి నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు జియో గంగా అనే కోడ్‌ నేమ్‌గా పిలవనుందని సమాచారం. దీపావళి నాటికి జియో 5జీ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్‌వైఎఫ్‌ కంపెనీ భాగస్వామ్యంతో జియో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 8 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న వార్తల ఆధారంగా ఈ ఫోన్‌ను 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని టాక్‌. స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 బేస్డ్‌ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుందని తెలుస్తోంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతో రానున్నట్లు సమాచారం. గూగుల్‌ లెన్స్‌, ట్రాన్స్‌లేట్‌ లాంటి గూగుల్‌ యాప్స్‌ ఇన్‌బిల్ట్‌గా ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి ఈ ఫోన్‌ను దీపావళికి లాంచ్‌ చేస్తారో లేదా చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..