Car AC: ఎండాకాలం కారులో ఏసీ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏసీ చెడిపోతే చాలా కష్టమవుతుంది. వాస్తవానికి కారు ఏసీ రిపేర్ చేయడం చాలా ఖరీదైనది. అంతేకాదు ఈ రిపేరుకు చాలా సమయం కూడా పడుతుంది. చాలామంది కారులో ఏసీ పనితీరు గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనివల్ల కార్ ఏసీ సిస్టమ్ పూర్తిగా చెడిపోతుంది. వాస్తవానికి మూడు కారణాల వల్ల ఏసీ పాడవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.
1. ఏసీ ఎయిర్‌ఫ్లోలో సమస్య
ముందుగా కారులో ఏసీ ఎయిర్‌ఫ్లో ఎలా ఉందో గమనించాలి. గాలి ప్రవాహం తక్కువగా ఉంటే ఏసీలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఏసీలో లీకేజీ లేదా కంప్రెషర్‌లో లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యని వెంటనే పరిష్కరిస్తే మంచిది.
2. ఏసీ ఆన్ చేయగానే పెద్ద సౌండ్
మీరు కారులోని ఏసీని ఆన్ చేయగానే ఇంజిన్ వైపు నుంచి పెద్ద శబ్ధం రావడం ప్రారంభిస్తే మీ ఏసీలో సమస్య ఉందని అది సరిగ్గా పనిచేయడం లేదని అర్థం చేసుకోండి. దీని వెనుక బ్యాడ్ కంప్రెషర్, ఇంటీరియర్ కాంపోనెంట్స్‌లో సమస్య, బేరింగ్‌లలో సమస్య ఉండవచ్చు. దీని కారణంగా AC నడుస్తున్నప్పుడు కారు పెద్ద శబ్దం చేస్తుంది.
3. ఏసీ నడుస్తున్నప్పుడు దుర్వాసన
ఏసీ ఆన్ చేసిన తర్వాత కారు వాసన రావడం ప్రారంభిస్తే ఎయిర్ వెంట్‌లో సమస్య ఉందని అర్థం. ఈ పరిస్థితిలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అందుకే ఏసీని ఒకసారి పూర్తిగా తనిఖీ చేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి