AI voice scam: కొంప ముంచుతోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. వెలుగులోకి వాయిస్‌ స్కామ్‌..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వాయిస్‌ స్కామ్‌ ద్వారా జనాలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్‌ మాడ్యులేషన్‌ ద్వారా జరిగిన ఈ మోసం ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒక మహిళకు తన కెనడాలో ఉంటున్న తన మేనల్లుడు చేసినట్లు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌తో రూపొందించిన ఈ ఫేక్‌ కాల్‌లో.. అతను ఓ యాక్సిడెంట్ చేశానని...

AI voice scam: కొంప ముంచుతోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. వెలుగులోకి వాయిస్‌ స్కామ్‌..
Ai Voice Scam

Updated on: Nov 28, 2023 | 7:36 PM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ప్రతీ రంగంలో కృత్రిమమేథ అనివార్యంగా మారింది. అయితే ఈ టెక్నాలజీ మానవ జీవితాలను ఎంత సలభతరం చేసిందో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఇటీవల వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వల్ల కలిగే నష్టాలకు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓకొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వాయిస్‌ స్కామ్‌ ద్వారా జనాలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్‌ మాడ్యులేషన్‌ ద్వారా జరిగిన ఈ మోసం ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒక మహిళకు తన కెనడాలో ఉంటున్న తన మేనల్లుడు చేసినట్లు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌తో రూపొందించిన ఈ ఫేక్‌ కాల్‌లో.. అతను ఓ యాక్సిడెంట్ చేశానని, వెంటనే రూ. 1.4 లక్షలు జరిమానా చెల్లించాలని తెలిపాడు. వెంటనే డబ్బులు పంపించాలని కోరడంతో వెనకా ముందు ఆలోచించని సదరు మహిళా వెంటనే అడిగిన డబ్బులను పంపిచేసింది. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసిన ఆమె షాక్‌ అయ్యింది. ఫోన్‌ చేసిన వ్యక్తి తన మేనల్లుడు కాదని, ఫేక్‌ కాల్‌ అని తెలిసిపోయింది. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసలేంటీ ఏఐ వాయిస్‌ స్కామ్‌..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఇతరుల వాయిస్‌ను ఇమిటేట్ చేస్తూ ఫేక్‌ కాల్స్‌ చేస్తూ, డబ్బులు కాజేస్తున్నారు. అయితే ఈ ఏఐ వాయిస్‌ స్కామ్‌ నుంచి బయటపడాలంటే.. మీకు కాల్ చేసిన వ్యక్తి ఐడెండింటి కచ్చితంగా తెలిసిన తర్వాతే వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదు. మీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నట్లు ఉన్నా సరే ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి. ఎవరి అకౌంట్‌లోకి డబ్బులు పంపుతున్నారు.? యూపీఐ ఐడీ ఎవరిది అనే విషయాలను గమనించాలి. వారి స్వంత నెంబర్లను కాల్‌ చేయకపోతే, కచ్చితంగా ఏదో మోసం జరుగుతుందని భావించాలి. ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ స్కామ్‌ బారిన పడకుండా చూసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..