Flubot Malware: స్మార్ట్‌ ఫోన్‌లే లక్ష్యంగా కొత్త మార్వేల్‌. పార్శిల్‌ పేరుతో మోసపూరితమైన లింక్‌.. క్లిక్‌ చేశారో..

|

Oct 04, 2021 | 4:09 PM

Flubot Malware: ఇంటర్‌నెట్‌ విస్తృతి పెరిగినప్పటి నుంచి రోజుకో రకమైన మాల్వేర్‌ స్మార్ట్‌ ఫోన్‌లను టార్గెట్‌ చేస్తోంది. రకరకల పద్ధతుల్లో స్మార్ట్‌ ఫోన్‌లోకి మాల్వేర్‌ను...

Flubot Malware: స్మార్ట్‌ ఫోన్‌లే లక్ష్యంగా కొత్త మార్వేల్‌. పార్శిల్‌ పేరుతో మోసపూరితమైన లింక్‌.. క్లిక్‌ చేశారో..
Follow us on

Flubot Malware: ఇంటర్‌నెట్‌ విస్తృతి పెరిగినప్పటి నుంచి రోజుకో రకమైన మాల్వేర్‌ స్మార్ట్‌ ఫోన్‌లను టార్గెట్‌ చేస్తోంది. రకరకల పద్ధతుల్లో స్మార్ట్‌ ఫోన్‌లోకి మాల్వేర్‌ను పంపించి వ్యక్తిగత వివరాలను కాజేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఫ్లూబోట్‌ పేరుతో మరో మాల్వేర్‌ స్మార్ట్‌ ఫోన్‌లను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నాయి. నిజానికి ఇది పాతదే అయినా ఇప్పుడు మళ్లీ కొత్త పద్ధతిలో తిరిగి వచ్చినట్లు భద్రతా సంస్థ ట్రెండ్ మైక్రో వినియోగదారులను హెచ్చరిస్తోంది.

ఎలా ప్రవేశిస్తుందంటే..

సైబర్‌ నేరగాళ్లు ఈ మాల్వేర్‌ను మొబైల్‌లోకి ప్రవేశపెట్డానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా స్మార్ట్‌ ఫోన్‌లోకి పార్శిల్‌ పేరుతో ఓ టెక్ట్స్‌ మెసేజ్‌ వస్తుంది. దానిలో ఉన్న లింక్‌ క్లిక్‌ చేయగానే ఒక పెద్ద మెసేజ్‌ వస్తుంది. ఆ మెసేజ్‌లో మీ మొబైల్‌కి ఫ్లూబోట్ అనే మాల్వేర్‌ సొకిందని.. దానిని తొలగించడం కోసం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ చేయండి. అందుకోసం ఇక్కడ క్లిక్‌ చేయండనే సందేశం వస్తుంది. ఇలా చేయగానే మొబైల్‌లో ఫ్లూబోట్ వైరస్ డౌన్‌లోడ్‌ అవుతుంది. మొబైల్‌ ఫోన్‌లోకి ప్రవేశించిన ఈ వైరస్‌.. తర్వాత ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, యాప్‌ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్‌ పేమెంట్స్‌, ఈ-మెయిల్, ట్విట్టర్‌ ఈ డేటా మొత్తాన్ని సైబర్‌ నేరగాడికి అందిస్తుంది. ఫోన్‌లోని కాంటాక్ట్‌ వివరాలు కూడా వెళ్లిపోతాయి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఈ ప్రమాదకరమైన వైరస్‌ నుంచి బయట పడాలంటే అనుమానాదాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదు. అలాగే లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లో డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. ఒకవేళ అనుమానాదాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తే వెంటనే ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Etela Rajender: నాకు గన్‌మెన్లని తగ్గించారు.. ఆ తేదీ వస్తుందంటే అనుమానం వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటెల సంచనలన కామెంట్స్

LPG Gas Connection: ఉచిత సిలిండర్లు అందిస్తున్న కేంద్రం.. కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి..!

Crime News: ప్రేమ పేరుతో మోసం.. ఆ తర్వాత వేధింపులు.. చివరికి ఆ బాలిక ఏం చేసిందంటే..?