ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ముఖ్యంగా అందులోని వివిధ రకాల యాప్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మీరు ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ అయిన యూట్యూబ్ కచ్చితంగా ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకట్టుకోవడానికి యూట్యూబ్ కూడా నయా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన యూట్యూబ్ షాట్స్ ప్లాట్‌ఫారమ్‌కి ఒక పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. క్రియేటర్‌లు 3 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసేలా ఉంటుందని పేర్కొంటున్నారు. అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. చాలా రోజులుగా కంటెంట్ క్రియేటర్లు మూడు నిమిషాల నిడివితో ఉన్న ఫీచర్ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ షాట్స్‌లో రిలీజైన నయా ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గతంలో యూట్యూబ్ షాట్స్ సాధారణంగా ఒక నిమిషం లోపు నిడివితో ఉండే వీడియోలను అందించేది. ఈ చిన్న వీడియోలు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో యూట్యూబ్ పోటీపడటానికి సహాయపడింది. అయితే ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ఎక్కువ నిడివితో వీడియోలకు మద్దతు ఇచ్చేందుకు రూపొందించారు. కంటెంట్ క్రియేటర్లకు ఈ కొత్త ఫీచర్ కారణంగా మరింత మెరుగ్గా వీడియోలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ గతంలో అప్‌లోడ్ చేసిన వీడియోలపై ఎలాంటి ప్రభావం చూపదు. వినియోగదారులు పొడవైన షార్ట్‌లను కనుగొనడంలో సహాయపడటానికి యూట్యూబ్ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
ఎక్కువ వీడియో నిడివితో పాటు కంటెంట్ సృష్టిని మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా చేయడానికి యూట్యూబ్ అనేక కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా ఈ కొత్త ఫీచర్ ద్వారా అధునాతన టెంప్లేట్‌లను ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. షార్ట్‌లో “రీమిక్స్” బటన్‌ను నొక్కి, “టెంప్లేట్‌ని ఉపయోగించండి” అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ట్రెండింగ్ వీడియోలను సులభంగా రీమిక్స్ చేయడానికి, రీక్రియేట్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది. రాబోయే నెలల్లో విడుదల చేయబోయే మరో అప్‌డేట్ షార్ట్‌లలో మరిన్ని యూట్యూబ్ కంటెంట్‌ను ఏకీకృతం చేసే అవకాశం ఇస్తుంది. క్రియేటర్‌లు త్వరలో తమ షార్ట్‌లను రూపొందించడానికి మ్యూజిక్ వీడియోలతో సహా వివిధ యూట్యూబ్ వీడియోల నుంచి క్లిప్‌లను ఉపయోగించవచ్చు. అలాగే గూగుల్ డీప్ మైండ్‌కు సంబంధించిన అధునాతన వీడియో మోడల్ వీఈఓ కూడా ఈ సంవత్సరం చివరలో షార్ట్స్ ఫీచర్‌కు విలీనం చేస్తారు. ఈ కొత్త అప్‌డేట్ సృష్టికర్తలకు మరింత శక్తివంతమైన వీడియో నేపథ్యాలతో పాటు స్వతంత్ర క్లిప్‌లను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..