జియో, శాంసంగ్ కలిసి మరో స్టెప్.. ఈసారి ఏంటంటే ?

| Edited By:

Oct 15, 2019 | 5:23 PM

దేశంలో మొబైల్ విప్లవం మరో ముందడుగు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఎంతగానో ఎదురు చూస్తున్న 5జి టెక్నాలజీ అమల్లోకి తెచ్చేందుకు టెలికామ్ సంస్థలు గేర్ అప్ అవుతున్నాయి. ఇందులో భాగంగా తొలి అడుగు వేశాయి రిలయెన్స్ జియో, శాంసంగ్ సంస్థలు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) 2019లో రిలయన్స్‌ జియో, శాంసంగ్‌లు నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీతో కూడిన 5జీ, ఎల్‌టీఈ మోడల్స్‌ను ప్రదర్శించాయి. దక్షిణాసియా, భారత్‌లోనే అతిపెద్ద డిజిటల్‌ సాంకేతికత ఈవెంట్‌గా పేరొందిన ఐఎంసీ ఈనెల 14 నుంచి […]

జియో, శాంసంగ్ కలిసి మరో స్టెప్.. ఈసారి ఏంటంటే ?
Follow us on

దేశంలో మొబైల్ విప్లవం మరో ముందడుగు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఎంతగానో ఎదురు చూస్తున్న 5జి టెక్నాలజీ అమల్లోకి తెచ్చేందుకు టెలికామ్ సంస్థలు గేర్ అప్ అవుతున్నాయి. ఇందులో భాగంగా తొలి అడుగు వేశాయి రిలయెన్స్ జియో, శాంసంగ్ సంస్థలు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) 2019లో రిలయన్స్‌ జియో, శాంసంగ్‌లు నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీతో కూడిన 5జీ, ఎల్‌టీఈ మోడల్స్‌ను ప్రదర్శించాయి.

దక్షిణాసియా, భారత్‌లోనే అతిపెద్ద డిజిటల్‌ సాంకేతికత ఈవెంట్‌గా పేరొందిన ఐఎంసీ ఈనెల 14 నుంచి 16 వరకూ ఢిల్లీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శాంసంగ్‌ నెట్‌వర్క్‌ భాగస్వామ్యంతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌, 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను నిర్మించింది. ఈ కార్యక్రమంలో ఇరు కంపెనీలు 5జీ ఎన్‌ఎస్‌ఏ విధానం వాడటం ద్వారా నూతన వ్యాపార అవకాశాల గురించి వివరించాయి.

4జీ ఎల్‌టీఈ, 5జీ టెక్నాలజీని మిళితం చేయడం ద్వారా వినియోగదారులకు ఎలాంటి వినూత్న సేవలు అందించవచ్చో వివరించాయి. మొబైల్‌ ఇంటర్‌నెట్‌, నిరంతరం డేటా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారుల జీవితంలో సమూల మార్పులు తీసుకువచ్చామని ఈ సందర్భంగా రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ప్రెసిడెంట్‌ మ్యాథ్యూ ఊమెన్‌ పేర్కొన్నారు. ఇక 5జీలోకి మారే ప్రక్రియలో అత్యున్నత ఎల్‌టీఈ నెట్‌వర్క్‌లు కీలకమని శాంసంగ్‌ నెట్‌వర్క్స్‌ బిజినెస్‌ హెడ్‌ పాల్‌ కుంగ్‌వున్‌ చెన్‌ పేర్కొన్నారు.