Dangerous Apps: అమ్మబాబోయ్.. ఫోన్లలో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. లేకపోతే మీ పనైపోయినట్టే..

|

Jan 31, 2023 | 12:28 PM

ఆధునిక కాలంలో చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. Google Play స్టోర్‌లలో ఇలాంటి అనేక యాప్‌లు ఉన్నాయి.

Dangerous Apps: అమ్మబాబోయ్.. ఫోన్లలో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. లేకపోతే మీ పనైపోయినట్టే..
Dangerous Apps
Follow us on

ఆధునిక కాలంలో చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. Google Play స్టోర్‌లలో ఇలాంటి అనేక యాప్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాత్రమే వినియోగించవచ్చు. సోషల్ మీడియా యాప్‌లు, పేమెంట్ యాప్‌లు, ఎడిటింగ్ యాప్‌లు ఇలా చాలా యాప్ లు గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా లభ్యమవుతాయి. అయితే, వీటిలో కొన్ని యాప్‌లు ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే హ్యాకర్లు ఫోన్‌ను క్యాప్చర్ చేసి, ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ థ్రెట్ ఫ్యాబ్రిక్ ఇటీవలి నివేదికలో షార్క్‌బాట్ అనే కొత్త బ్యాంకింగ్ ఫార్మాలిటీ అనేక దేశాల్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులను మోసం చేసిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ లో కొన్ని యాప్‌లు అస్సలు ఉంచుకోవద్దని సూచించింది.

అత్యంత ప్రమాదకరమైన యాప్‌లు..

నివేదిక ప్రకారం.. 5 యాప్‌లు మహా డేంజర్ అని గుర్తించారు. ఈ ఐదు యాప్‌లు ఇన్‌స్టాల్ చేస్తే హ్యాకర్లు దోపిడీకి పాల్పడినట్లు తేలింది. ఇంకా వినియోగదారులను సులభంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని నిర్ధారణ అయింది. ఈ స్కామ్ ద్వారా వినియోగదారుల ఖాతా నంబర్, లాగిన్ ఐడీ సమాచారం లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది బ్యాంకింగ్ ట్రోజన్ వల్చర్ అని పేర్కొంది.

థ్రెట్ ఫ్యాబ్రిక్ రిపోర్టు ప్రకారం.. వల్చర్ అనేది ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్. ఇది ఫోన్ ల ద్వారా స్క్రీన్-స్ట్రీమింగ్ సామర్థ్యాలను ఉపయోగించడంతోపాటు కొన్ని రహస్య వివరాలను దొంగలించే ప్రత్యేకతను కూడా కలిగి ఉంది..దీంతో ఖాతాల్లో నగదు సహా కీలక వివరాలు కూడా మాయమవుతాయని పేర్కొంది. ThreatFabric ప్రకారం.. Google Play స్టోర్‌లో 1,000 నుంచి లక్ష ఇన్‌స్టాలేషన్‌ల వరకు మూడు కొత్త డ్రాపర్‌లను కనుగొంది. ఆ 5 యాప్స్ ఏంటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఈ యాప్‌లను వెంటనే డిలీట్ చేయండి..

  • Manager Small Lite (మేనేజర్ స్మాల్ లైట్)
  • My Finances Tracker (మై ఫైనాన్స్ ట్రాకర్)
  • Zetter Authentiction (జెట్టర్ అథెంటికేషన్)
  • Codice Fiscale 2022 (కోడైస్ ఫిస్కేల్ 2022)
  • Recover Audio (రికవర్ ఆడియో)
  • Image and Videos (ఇమేజ్ – వీడియోలు)

అయితే, ఈ యాప్‌లు మిలియన్ల కొద్దీ డౌన్‌లోడ్‌లు అయ్యాయి. మీరు కూడా ఈ యాప్‌లలో దేనినైనా డౌన్‌లోడ్ చేసి ఉంటే, వెంటనే వాటిని తొలగించడం మంచిదని ఫ్యాబ్రిక్ రిపోర్ట్ వెల్లడించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..