విశాఖ బయల్దేరిన చంద్రబాబు..కేంద్ర హోంశాఖ అనుమతి
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం బయల్దేరారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది.

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం బయల్దేరారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబునాయుడు విశాఖ వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వినతికి సానుకూలంగా పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఆయన విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చింది. దీంతో చంద్రబాబు విశాఖ పర్యటనకు సిద్ధమయ్యారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. ఇప్పటికే స్థానిక నేతలతో ఫోన్‌లలో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీ ప్రమాదానికి సంబంధించిన పరిస్తితులపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబుకు విశాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, బాధితుల పరిస్థితిని అక్కడి నేతలకు వివరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు, బాధితులకు అండగా నిలవాలనీ, సహాయకార్యక్రమాలలో పాల్గొనాలని చంద్రబాబు వారికి సూచించారు.