World Test Championship: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తంగా తొమ్మిది టీమ్స్ పోటిపడుతున్న ఈ టోర్నమెంట్‌లో భారత్.. ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆ ప్లేస్‌ను పదిలం చేసుకునేందుకు టీమిండియా మరో పోరాటానికి సిద్దమైంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను 2-0, 3-1, 4-0, 3-0తో కైవసం చేసుకుంటే.. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న 430 పాయింట్లతో పాటు మరో 75 పాయింట్లు యాడ్ అవుతాయి. దీనితో రాబోయే ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా సిరీస్‌తో సంబంధం లేకుండానే సరాసరి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అడుగుపెడుతుంది.
అటు ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్ సాధించాలంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను 3-0, 2-0తో కైవసం చేసుకోవాలి. ఒకవేళ ఆ సిరీస్ రద్దైతే మాత్రం మూడో స్థానానికి సరిపెట్టుకుని ఫైనల్స్ ముందు నిష్క్రమిస్తుంది. ఇక ఇంగ్లాండ్ ఫైనల్ చేరాలంటే.. శ్రీలంకతో చివరి టెస్టు గెలుపొందడమే కాకుండా.. భారత్‌తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. కాగా, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ రెండు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.