AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ ఫైట్‌కు బీ రెడీ..!

ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు లీడ్స్ వేదికగా తలబడనున్నాయి. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అటు దాయాది పాకిస్థాన్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ ఆశలను మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ 7 మ్యాచ్‌లు ఆడి.. 3 గెలిచి, 3 ఓడి.. 7 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కాగా […]

బిగ్ ఫైట్‌కు బీ రెడీ..!
Ravi Kiran
|

Updated on: Jun 29, 2019 | 8:31 AM

Share

ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు లీడ్స్ వేదికగా తలబడనున్నాయి. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అటు దాయాది పాకిస్థాన్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ ఆశలను మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ 7 మ్యాచ్‌లు ఆడి.. 3 గెలిచి, 3 ఓడి.. 7 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

ఇక రెండో మ్యాచ్ డిఫెండింగ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా హోరాహోరీ పోరు జరగనుంది. సమవుజ్జీలైన ఈ రెండు జట్లలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. ఇప్పటికే సెమీస్‌కు చేరిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తోంది. అటు కివీస్ ఈ మ్యాచ్ గెలిచి సెమీస్‌కు చేరాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.