వరల్డ్‌కప్ 2019: లంకేయులు పరిస్థితి ఏంటి.?

ప్రపంచకప్‌లో భాగంగా చెస్టర్-లే-స్ట్రీట్ వేదికగా శుక్రవారం శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో సఫారీలు 9 వికెట్లు  తేడాతో లంకను చిత్తుగా ఓడించారు. దీనితో లంకేయులు టోర్నీ నుంచి నిష్క్రమణ దాదాపు ఖాయమైంది. సెమీస్‌కు చేరాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో లంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. అయితే శ్రీలంక మాత్రం సాంకేతికంగా సెమీస్ చేరడానికి ఇంకా అవకాశం ఉంది. ఆ జట్టు ఆడబోయే మిగిలిన రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ […]

వరల్డ్‌కప్ 2019: లంకేయులు పరిస్థితి ఏంటి.?
Follow us

|

Updated on: Jun 29, 2019 | 11:04 AM

ప్రపంచకప్‌లో భాగంగా చెస్టర్-లే-స్ట్రీట్ వేదికగా శుక్రవారం శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో సఫారీలు 9 వికెట్లు  తేడాతో లంకను చిత్తుగా ఓడించారు. దీనితో లంకేయులు టోర్నీ నుంచి నిష్క్రమణ దాదాపు ఖాయమైంది. సెమీస్‌కు చేరాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో లంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.

అయితే శ్రీలంక మాత్రం సాంకేతికంగా సెమీస్ చేరడానికి ఇంకా అవకాశం ఉంది. ఆ జట్టు ఆడబోయే మిగిలిన రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ తప్పక విజయం సాధించాలి. దానితో పాటు మిగిలిన జట్ల విజయాల మీద కూడా వీరికి ప్రభావం ఉంటుంది,

మరోవైపు ఇవాళ ఆఫ్ఘానిస్తాన్ జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ మెరుగైన రన్‌రేట్‌తో మ్యాచ్‌లో విజయం సాధించాలి. అప్పుడే ఆ జట్టు సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది.

Latest Articles