INDW vs ENGW: కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన టీమిండియా అమ్మాయిలు.. విజయం కోసం ఇంగ్లండ్‌ ఎన్ని పరుగులు చేయాలంటే..

Women’s World Cup 2022: ప్రపంచకప్‌లో చావోరేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు చేతులెత్తేశారు.

INDW vs ENGW: కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన టీమిండియా అమ్మాయిలు.. విజయం కోసం ఇంగ్లండ్‌ ఎన్ని పరుగులు చేయాలంటే..
Indw Vs Engw

Updated on: Mar 16, 2022 | 12:25 PM

Women’s World Cup 2022: ప్రపంచకప్‌లో చావోరేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు చేతులెత్తేశారు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కుదేలైన  భారత బ్యాటర్లు సులువుగా వికెట్లు ఇచ్చేశారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2022లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన 35 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచింది. వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ (33), జులన్‌ గోస్వామి (20), హర్మన్‌ప్రీత్ కౌర్‌ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో చార్లెట్‌ డీన్‌ 4, అన్యష్రబ్‌ సోలే2, సోఫీ, కేట్‌ క్రాస్‌ ఒక్కొక్క వికెట్‌ తీశారు.

సింగిల్‌ డిజిట్‌కే ..

కాగా టాస్‌ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేన ఇంగ్లిష్‌ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన క్రీజులో నిలదొక్కుకున్నా ఆమెకు సహకారం అందించే వారే కరువయ్యారు. యషికా భాటియా (8), కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (1), దీప్తిశర్మ (0) పూర్తిగా నిరాశపరిచారు. ఆల్‌రౌండర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కొద్దిసేపు క్రీజులో నిలిచినా భారీస్కోరు చేయలేకపోయింది. ఇంగ్లిస్‌ బౌలర్ల విజృంభణకు ఒకనొక దశలో 86 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే రిచాఘోష్‌ రాణించడంతో స్కోరుబోర్డు వంద పరుగులు దాటింది.

Also Read:BEML Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..

Telangana: వనపర్తిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..

Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..