IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ అయిపోయాక రోహిత్, కోహ్లీ ఏం చేశారో తెలుసా..

|

Oct 03, 2022 | 8:42 PM

ఆటలో గెలుపోటములు సహజం, ఒక రోజు ఒకరు గెలిస్తే.. ఇంకో రోజు మరొకరు గెలుస్తారు. గెలిచామని విర్రవీగకుండా.. ఓడిపోయామని నిరాశచెందకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లడమే ఆటగాళ్ల లక్షణం. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో..

IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ అయిపోయాక రోహిత్, కోహ్లీ ఏం చేశారో తెలుసా..
Rohit Sharma, Virat Kohli, David Miller
Follow us on

ఆటలో గెలుపోటములు సహజం, ఒక రోజు ఒకరు గెలిస్తే.. ఇంకో రోజు మరొకరు గెలుస్తారు. గెలిచామని విర్రవీగకుండా.. ఓడిపోయామని నిరాశచెందకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లడమే ఆటగాళ్ల లక్షణం. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఇలాంటి క్రీడా స్ఫూర్తికి సంబంధించిన సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. క్రికెట్ లో అయితే కొన్ని సార్లు క్రీడా స్ఫూర్తిని కలిగించే ఘటనలతో పాటు, కొన్ని సందర్భాల్లో అదే స్ఫూర్తిని మంటగలిపే ఘటనలను చూస్తూ ఉంటాం. కాని అక్టోబర్ 3వ తేదీన భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన గువహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. స్కోర్ పరంగా ఇరు జట్లు భారీ స్కోర్ చేసినప్పటికి, ఇదే సమయంలో క్రీడా స్ఫూర్తికి సంబంధించిన అనేక ఘటనలు ఈ మ్యాచ్ లో కనిపించాయి. ముఖ్యంగా ఓడిపోయినప్పటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ పోరాట పటిమను ఎవరైనా మెచ్చుకోవల్సింది. సరిగ్గా మ్యాచ్ పూర్తయి గ్రౌండ్ లోంచి వెళ్తున్నప్పుడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డేవిడ్ మిల్లర్ వద్దకెళ్లి అభినందించి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. వాస్తవానికి రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే విజయం కోసం డేవిడ్ మిల్లర్ తీవ్రంగా శ్రమించినా ఫలితం అనుకూలంగా రాలేదు. అయినప్పటికి తన పోరాట సెంచరీతో క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. మిల్లర్ ఆటకు ముగ్దులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు.

కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేసిన మిల్లర్ ఆఖరి వరకు బ్యాటింగ్ చేసినప్పటికి జట్టు విజయానికి ఆకవల్సిన ఫినిషింగ్ టచ్ అందించలేకపోయాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ డేవిడ్ మిల్లర్ ను అభినందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.

ఇవి కూడా చదవండి

ఓపెనర్లు శుభారంబాన్ని ఇవ్వకపోవడంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో గెలవలేకపోయింది. కెప్టెన్ టెంబా బవుమా ఏడు బంతులు ఆడి ఎటువంటి పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. రిలీ రోసౌ కూడా ఎటువంటి పరుగులు చేయకుండానే ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో అర్ష్ దీప్ సింగ్ వీరిద్దరిని అవుట్ చేశాడు. ఆ తర్వాత మార్కరమ్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మూడు వికెట్లు పడిన తర్వాత.. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ కలిసి చివరి వరకు ఆడారు. డికాక్ 48 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో చివరిలో డెవిడ్ మిల్లర్, క్వింటాన్ డికాక్ లను భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వారిద్దరి వద్దకు వెళ్లి అభినందించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..