Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో తొలిసారి ఎంట్రీ ఇవ్వనున్న క్రీడలేవో తెలుసా?

|

Jul 20, 2021 | 11:54 AM

టోక్యో వేదికగా జులై 23 నుంచి ఒలింపిక్స్ మొదలుకానున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి కొన్ని ఆటలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మొత్తం ఆరు క్రీడలను టోక్యో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయబోతున్నాయి.

Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో తొలిసారి ఎంట్రీ ఇవ్వనున్న క్రీడలేవో తెలుసా?
Follow us on

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌ మరో ఏడు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. గతేడాది జరగాల్సిన ఈ క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. టోక్యో వేదికగా జులై 23 నుంచి ఒలింపిక్స్ మొదలుకానున్నాయి. ఈ పోటీలకు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. తొలివిడతగా రేపు కొంతమంది టోక్యో ప్రయాణం కానున్నారు. ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి కొన్ని ఆటలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మొత్తం ఆరు క్రీడలను టోక్యో ఒలింపిక్స్‌లో అరంగేట్రంచేయబోతున్నాయి. ఇందులో రెండు గతంలో ఎగ్జిబిషన్ ఈవెంట్లుగా ఆడించినా.. ఏవో కారణాలతో వాటిని తొలగించారు. మరలా టోక్యో ఒలింపిక్స్‌2021 లో పతకం సాధించే ఈవెంట్లలో చేర్చారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి కనిపించే ఆటల్లో ప్రధానమైంది బేస్‌బాల్‌. 1992లో ఇది మెడల్ ఈవెంట్ గానే ఒలింపిక్స్‌లో ఉంది. దీనిని2008లో ఒలింపిక్స్ నుంచి తీసేశారు. జపాన్‌లో ఈ ఆట బాగా పాపులర్. ప్రతీ ఏటా జపాన్‌లో జరిగే నిప్పన్ ప్రొఫెషనల్ బేస్‌బాల్ లీగ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆటగా పేరుగాంచింది. దాంతో ఈ సారి ఒలింపిక్స్‌లో బేస్‌బాల్‌ను మెడల్ ఈవెంట్‌గా చేర్చారు. ఈ ఆటలో 6 దేశాలు పోటీ పడనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. మహిళల కోసం కూడా ఈ ఆటను ఒలింపిక్స్ లో చేర్చారు. మహిళలు ఆడనున్న బేస్‌బాల్‌ను ‘సాఫ్ట్ బాల్’ పేరుతో పిలవననున్నారు. దీనిని కూడా 2008 ఒలింపిక్స్ నుంచి తొలగించారు. అయితే, 2024 పారీస్ లో నిర్వహించే ఒలింపిక్స్‌లో మాత్రం సాఫ్ట్‌బాల్‌ను ఆడించరని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.

టోక్యో ఒలింపిక్స్‌లో మొదటిసారి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆట స్కేట్ బోర్డింగ్. మహిళలు, పురుషుల విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. పార్క్, స్ట్రీట్ రెండింటిలో మెడల్స్ ఇవ్వనున్నారు. అలాగే సర్ఫింగ్‌ని కూడా టోక్యో ఒలింపిక్స్‌లో చేర్చారు. ఇకనుంచి ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో ఆడించేందుకు ప్లాన్ చేసినట్లు నిర్వాహాక కమిటీ పేర్కొంది. రాక్ క్లైంబింగ్‌ను కూడా తొలిసారి ఒలింపిక్స్‌లో ప్రవేశ పెట్టారు. 1985 నుంచి రాక్ క్లైంబింగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇక మరో ముఖ్యమైన ఆట.. కరాటేను కూడా ఈ ఏదాడి ఒలింపిక్స్‌లో చేర్చారు. 1868లో జపాన్‌లోని ఒకినావాలో ఇది పుట్టిందని చరిత్ర చెబుతోంది. అలా చిన్నగా జపాన్ నుంచి మిగతా ఆసియా దేశాలకు కరాటే పాకింది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఈ ఆట బాగా పాపులర్ అయింది. కానీ, ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోలేక పోయింది. ఈ సారి జపాన్‌లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. దాంతో మొదటిసారి కరాటేను ఒలింపిక్స్‌లో చేర్చారు. అయితే, తరువాత జరిగే ఒలింపిక్స్‌లో మాత్రం కరాటే కనిపించదు. బాస్కెట్‌బాల్‌ను కూడా మొదటిసారి టోక్యో ఒలింపిక్స్‌లో చేర్చారు. ఇందులోనూ పురుషుల, మహిళల ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీటితోపాటు ఫ్రీస్టైల్ బీఎంఎక్స్ కూడా టోక్యో ఒలింపిక్స్‌లో కనిపించనుంది.

Also Read:

Tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో హార్వర్డ్ గ్రాడ్యుయేట్.. కాలేయంలో కణితితో ట్రయల్స్‌లో పాల్గొని సరికొత్త రికార్డు..!

T20 World Cup 2021: సూపర్ 12లో దాయాదుల పోరు; గ్రూపు 2లో భారత్, పాకిస్తాన్ టీంలు