Tokyo Olympics 2021: ప్రారంభోత్సవంలో 15 దేశాల నాయకులు.. ప్రతీ దేశం నుంచి 6 గురు.. విశ్వ క్రీడలకు రంగం సిద్ధం

|

Jul 22, 2021 | 8:23 AM

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ప్రతీ దేశం నుంచి ఆరుగులు అధికారులు మాత్రమే పాల్గొనేలా జపాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 15 దేశాల నాయకులు విశ్వ క్రీడల వేడుకల్లో భాగం కానున్నట్లు నిర్వాహాకులు పేర్కొన్నారు.

Tokyo Olympics 2021: ప్రారంభోత్సవంలో 15 దేశాల నాయకులు.. ప్రతీ దేశం నుంచి 6 గురు.. విశ్వ క్రీడలకు రంగం సిద్ధం
Tokyo Olympics
Follow us on

Olympics 2021 Opening Ceremony: టోక్యో ఒలింపిక్ క్రీడలు జులై 23 న మొదలుకానున్నాయి. క్రీడల ప్రారంభోత్సవానికి ప్రేక్షకులకు అనుమతి లేదు. ప్రారంభోత్సవ వేడుకల్లో అభిమానులు లేకపోవడం ఇదే మొదటిసారి. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ప్రతీ దేశం నుంచి ఆరుగురు అధికారులు మాత్రమే పాల్గొంటారు. దాదాపు 15 దేశాల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సంఖ్యను బాగా తగ్గించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అందుకే ఈ ఏడాది ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవంలో సుమారు 15 దేశాల నాయకులు హాజరవనుండగా.. ప్రతీ దేశం నుంచి ఆ సం‌ఖ్యను బాగా తగ్గించినట్లు తెలిపారు. చెఫ్ డి మిషన్ సమావేశానికి హాజరైన ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా ఈ విషయాన్ని ధృవీకరించారు. కరోనా కేసులు ఇంకా పెరిగితే ఆటలను రద్దు చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

జపాన్ నుంచి వస్తున్న నివేదికల ప్రకారం, ఈ వేడుకల్లో హాజరయ్యే వారి సంఖ్య సుమారు 1000 వరకు ఉండనుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా నిర్వాహకులు అతిథుల సంఖ్యను బాగా తగ్గించినట్లు తెలుస్తోంది. మాములుగా అయితే ప్రారంభోత్సవ వేడుకలో వేలమంది హాజరుకానున్నారు. కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

ప్రతీ దేశం నుంచి ఆరుగురు..
ప్రారంభోత్సవ వేడుకలో ప్రతీ దేశం నుంచి ఆరుగురు అధికారులు మాత్రమే పాల్గొంటారు. 70 మంది క్యాబినెట్ స్థాయి అధికారులు కూడా టోక్యో ఒలింపిక్స్ వేడుకలకు హాజరు కావాల్సి ఉందని కైటో తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంత మంది వీఐపీలు పాల్గొంటారనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదని ఆయన అన్నారు. కాగా, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మంగోలియన్ ప్రధాన మంత్రి లువ్సనంసరై ఓయున్ ఎర్డెన్, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్‌తో పాటు మరికొంతమంది ప్రారంభ వేడుకల్లో పాల్గొంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చాలా మంది వెనకడుగు..
జపాన్‌లో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది నాయకులు తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనకూడదంటూ నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రపంచ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు ఒలింపిక్ క్రీడలు ప్రధానమంత్రి యోషిహిదే సుగాకు విలువైన అవకాశాన్ని ఇస్తాయని చీఫ్ క్యాబినెట్ కార్యదర్శి కైటో పేర్కొన్నారు. గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేకుండా ఒలింపిక్ క్రీడలు జరగడం ఇదే తొలిసారి.

Also Read:

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే జంటలు వీరే.. భారత్ నుంచి కూడా..!

Brisbane Olympics 2032: బ్రిస్బేన్‌లోనే 2032 ఒలింపిక్ గేమ్స్.. ప్రకటించిన ఐఓసీ

Tokyo Olympics 2021: బోపన్నపై వేటు పడనుందా.. మరింత ముదిరిన ఐటా వివాదం.. డేవిస్‌ కప్‌లో డౌటే?