Mirabai Chanu: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించి భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం కోసం భారతదేశం 21 సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. రెండోవ రోజు రజత పతకం సాధించి భారత ఖాతాను తెరిచింది. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఈ పతకాన్ని గెలుచుకుంది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లలో మొత్తం 202 కిలోలను ఎత్తి మీరాబాయి పతకాన్ని గెలుచుకుంది. దీంతో దేశమంతా ఆనందలో మునిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా మీరాబాయి చానును అభినందింస్తూ ఎంతోమంది ట్వీట్లు చేశారు.
మీరాబాయి చాను పతకం సాధించడంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పలు బహుమతులను ప్రకటించాయి. డొమినోస్ ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది. మల్టీనేషనల్ పిజ్జా సంస్థ డొమినోస్ మీరాబాయి చానుకు లైఫ్ టైం ఫ్రీ పిజ్జా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈమేరకు ట్వీట్ చేసింది. ‘మీరాబాయి చాను చెప్పారు.. మేము విన్నాము. మీరాబాయి చాను పిజ్జా తినేందుకు వేచి ఉండాలని మేము కోరుకోవడం లేదు. అందుకే తనకు ఉచిత డొమినోస్ పిజ్జాను జీవితాంతం అందిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది.
ఇటీవల ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పిజ్జాను చాలాకాలంగా తినలేదని, అందుకే నేను పిజ్జా తినాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో పతకం గెలిచిన వెంటనే డొమినోస్ ఇండియా జీవితకాలం ఉచిత పిజ్జా అందిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నెటిజన్లు కూడా స్వాగతించారు.
She said it, we heard it?
We never want @mirabai_chanu to wait to eat ? again so we’re treating her to FREE Domino’s pizza for life! #PizzasForLife— dominos_india (@dominos_india) July 24, 2021
Also Read:
Tokyo Olympics 2020, Day 3: 9 క్రీడల్లో భారత అథ్లెట్లు బరిలోకి…అందరి చూపు మేరీకోమ్, సింధులపైనే..
Tokyo Olympics 2021: నిరాశ పరచిన భారత మహిళా హాకీ జట్టు.. నెదర్లాండ్ చేతితో 1-5 గోల్స్ తేడాతో ఓటమి