Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో సూపర్ సండే ప్రారంభం కూడా భారత్‌కు కలిసిరాలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఇద్దరు భారత షూటర్లు మను బాకర్, యషస్విని దేస్వాల్ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. షూటర్‌లు ఇద్దరూ క్వాలిఫికేషన్ రౌండ్‌లో లక్ష్యాన్ని చేరుకోలేక నిరాశపరిచారు. ఫైనల్లో చోటు దక్కించుకోవాలంటే టాప్ 8 కి చేరుకోవాల్స ఉంది. కానీ, మను 12 వ స్థానంలో, యషస్విని 13 వ స్థానంలో నిలిచారు. మను బాకర్ క్వాలిఫికేషన్‌లో అద్భుతంగా రాణిస్తాడని అనుకున్నారు. కానీ, మను పిస్టల్ ఆమెను మోసం చేసింది. కేవలం 2 పాయింట్ల తేడాతో ఫైనల్ బెర్త్‌కు దూరమయింది. యషస్విని కూడా 3 పాయింట్ల దూరంలో ఆగిపోయింది. మను బాకర్ అర్హత రౌండ్లో 575 మార్కులు సాధించి 12 వ స్థానంలో నిలిచింది. అలాగే యషస్విని దేస్వాల్ 574 పాయింట్లు సాధించి 13 వ స్థానంలో నిలిచింది. ఫైనల్‌లో అర్హత సాధించేందుకు కావాల్సిన 577 పాయింట్లు సాధించలేక చతికిలపడ్డారు.
భారత షూటర్ మను బాకర్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఘనంగానే ప్రారంభించింది. దాంతో ఈజీగానే ఫైనల్ చేరుకుంటుంది అనుకున్నారంతా. కానీ, తన పిస్టల్‌లో సాంకేతిక లోపం రావడంతో, అనుకున్న సమయం కంటే 5 నిమిషాలు ఎక్కువగా తీసుకుంది. అనంతరం బరిలోకి దిగినా..ఒత్తిడి లోనై లక్ష్యానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో నిలిచిపోయింది. యషస్విని కూడా లక్ష్యం చేరడంలో తడబడింది. దీంతో మొదటి 8 స్థానాలు సాధించలేక ఫైనల్ అవకాశాలను కోల్పోయారు.
Also Read:
Tokyo Olympics 2021: రజత పతకధారి మీరాబాయి చానుకి బంఫర్ ఆఫర్..!