గోల్డెన్ హ్యాట్రిక్‌తో ఒలింపిక్ బరిలోకి ఇండియన్ ఆర్చర్.. తొలి పతకంపై కన్నేసిన దీపిక కుమారి

|

Jul 20, 2021 | 11:49 AM

Tokyo Olympics 2021: జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభమయ్యే ఒలింపిక్ గేమ్స్ -2020 లో భారత మహిళా ఆర్చర్ దీపిక కుమారి పతకం సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ ఆర్చర్ కూడా పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.

గోల్డెన్ హ్యాట్రిక్‌తో ఒలింపిక్ బరిలోకి ఇండియన్ ఆర్చర్.. తొలి పతకంపై కన్నేసిన దీపిక కుమారి
Deepika
Follow us on

Tokyo Olympics 2021: జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభమయ్యే ఒలింపిక్ గేమ్స్ -2020 లో భారత మహిళా ఆర్చర్ దీపిక కుమారి పతకం సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ ఆర్చర్ కూడా పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్ పతకం సాధించగల సామర్థ్యం తనకు ఉందని దీపిక తెలిపింది. దీపిక మూడోసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటుంది. లండన్ ఒలింపిక్స్ -2012, అనంతరం రియో ​​ఒలింపిక్స్ -2016 లో పాల్గొంది. ఈ రెండు ఒలింపిక్ క్రీడలలోనూ రాణించలేకపోయింది. దీంతో ఈసారి ఒలింపిక్స్‌లో రాణించాలని పట్టుదలతో ఉంది. ప్రపంచ నెంబర్ వన్ ఆర్చర్ దీపిక మాట్లాడుతూ, “నేను పతకం కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉంది. ఈ ఒలింపిక్స్‌లో పతకం గెలవడం చాలా ముఖ్యం. నాకు, విలువిద్య బృందానికి, నా దేశానికి కూడా పతకం చాలా ముఖ్యం. ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ విలువిద్యలో పతకం సాధించలేదు. అందుకే నేను టోక్యోలో పతకం సాధించాలని ఆరాటపడుతున్నాను” అని వెల్లడించింది.

లండన్ నుంచి టోక్యోకు..
లండన్ ఒలింపిక్స్‌కు ముందే, ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్చర్‌గా దీపిక నిలిచింది. ప్రస్తుతం మరోసారి టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. “లండన్ నుంచి ఇప్పటి వరకు చాలా మార్పు వచ్చింది. నేను మానసికంగా ఎంతో కష్టపడ్డాను. ఇది సానుకూల ఫలితాలను అందిస్తుందని భావిస్తున్నాను. గత రెండు ఒలింపిక్స్‌లో నేను చాలా వెనుకంజలో ఉండిపోయాను. ప్రస్తుతం చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాను. నిరంతరం మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తున్నాను” అని పేర్కొంది. ఒలింపిక్స్‌లో దీపిక భారతదేశపు తరపున పాల్గొంటున్న ఏకైక మహిళా ఆర్చర్ కావడం విశేషం. జులై 27 నుంచి బరిలోకి దిగనుంది. మరోవైపు, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ ఒలింపిక్స్ మొదటి రోజే జరగనున్నాయి.

ఒలింపిక్స్‌కు ముందు గోల్డెన్ హ్యాట్రిక్
టోక్యోలో దీపిక పతకం సాధిస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. కారణం, పారిస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో మూడు బంగారు పతకాలు సాధించింది. దీంతో దీపికపై అంచనాలు పెరిగాయి. మహిళల రికర్వ్ టీం ఈవెంట్‌లో దీపికా కుమారి, అంకితా భకత్, కోమలిక బారి బంగారు పతకం సాధించారు. దీపిక తన భర్త, తోటి ఆర్చర్ అతాను దాస్‌తో కలిసి మిశ్రమ ఈవెంట్‌లో తలపడింది. ఈ జంట బంగారు పతకాన్ని గెలుచుకుంది. దీపిక వ్యక్తిగత ఈవెంట్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది.

Also Read:

సయీద్ అన్వర్‌ను ఇబ్బంది పెట్టిన టీమిండియా పేసర్.. సచిన్‌తో మొరపెట్టుకున్న పాకిస్తానీ బ్యాట్స్‌మెన్!

Viral Photo: 2 కోట్ల లైకులతో ఇన్‌స్టా ఫొటో రికార్డు.. రొనాల్డోను బీట్ చేసిన అర్జెంటీనా స్టార్ ప్లేయర్!