Tokyo Olympics 2021: బోపన్న, సానియా.. ఐటీఎఫ్‌ రూల్స్‌ పుస్తకాన్ని ఓసారి చదవండంటూ ఐటా ఫైర్; ముదురుతున్న వివాదం!

|

Jul 20, 2021 | 12:45 PM

టెన్నిస్ డబుల్ స్పెషలిస్టు రోహన్ బోపన్న, అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మధ్య వివాదం ముదురుతోంది. టోక్యో ఒలింపిక్స్ అర్హతకు సంబంధించి ఈ వివాదం నడుస్తోంది. తాజాగా బోపన్న ఐటాపై విమర్శలు గుప్పించడంతోపాటు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

Tokyo Olympics 2021: బోపన్న, సానియా.. ఐటీఎఫ్‌ రూల్స్‌ పుస్తకాన్ని ఓసారి చదవండంటూ ఐటా ఫైర్; ముదురుతున్న వివాదం!
Rohan Bopanna Aita Issue
Follow us on

Rohan Bopanna- ITA Issue: టెన్నిస్ డబుల్ స్పెషలిస్టు రోహన్ బోపన్న, అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మధ్య వివాదం ముదురుతోంది. టోక్యో ఒలింపిక్స్ అర్హతకు సంబంధించి ఈ వివాదం నడుస్తోంది. తాజాగా బోపన్న ఐటాపై విమర్శలు గుప్పించడంతోపాటు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కంబైన్డ్ ర్యాంకింగ్స్‌లో దివిజ్ శరణ్‌తో కలిసి టోక్యోకు అర్హత సాధించడంలో బోపన్న విఫలమయ్యాడు. దీంతో సుమిత్ నగాల్‌తో కలిసి డబుల్స్ ఆడేందుకు అనుమతించాలని ఐటీఎఫ్‌ను ఐటా కోరింది. దీంతో ఈ వివాదం మొదలైంది. అయితే, జట్టు ఫైనల్ చేశాక మార్పులు ఉండవని ఐటీఎఫ్ ముందే చెప్పిందని తెలుస్తోంది. కాగా, ఐటా మాత్రం ఇంకా ఛాన్స్ ఉందంటూ బోపన్నకు చెప్పింది. ఇంత వరకు ఎలాంటి వివరణ లేకుండా తప్పుదోవ పట్టించిందని బోపన్ ఆరోపించాడు. బోపన్నకు టెన్నిస్ స్టార్ సానిమా మీర్జా కూడా వంత పలకండంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. బోపన్న ర్యాంకింగ్‌ ఆధారంగా ఒలింపిక్స్‌ అవకాశం దక్కలేదు. అయితే, తమ కంటే తక్కువ ర్యాంకు ఆటగాళ్లకు టోక్యో టిక్కెట్‌ ఇచ్చి అన్యాయం చేశారని బోపన్న ఆరోపణలు గుప్పించాడు. అయితే, చాలామంది అథ్లెట్లు ఒలింపిక్స్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌కు టోక్యో బెర్తు ఖాయమైంది.

ఈ నేపథ్యంలో చివరి అవకాశంగా నగాల్‌తో పాటు బోపన్నను ఆడించాలని ఐటా ప్లాన్ చేసింది. ఈమేరకు ఐటీఎఫ్‌కు ప్రతిపాదించినట్లు పేర్కొంది. జూన్‌ 22న ప్రతిపాదనలకు అర్హత గడువు ముగిసిందని, ఇప్పటికే అర్హత సాధించిన అథ్లెట్ గాయపడడమో లేక అనారోగ్యంతో వైదొలిగితే కొత్త ఎంట్రీలను పంపవచ్చని ఐటీఎఫ్‌ స్పష్టంగా పేర్కొంది. ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐటా మాత్రం మాకు ఇంకా అవకాశం ఉందంటూ క్రీడాకారులతోపాటు ప్రభుత్వాన్ని, మీడియాను కూడా తప్పుదోవ పట్టించిందంటూ బోపన్న ట్వీట్‌ చేయడం కలకలం రేపింది.

బోపన్నకు తోడుగా సానియామీర్జా కూడా స్పందించింది. బోపన్న ట్వీట్‌కు మద్దతు తెలిపింది. ఈమేరకు ఆమె ‘ఇవే నిజమైతే ఐటా చాలా తప్పు చేసింది. సుమిత్‌తో పాటు నీ పేరు ఇవ్వకపోవడం వల్ల మనిద్దరం కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆడలేకపోతున్నాం’’ అని ట్వీట్‌ చేసింది. కాగా, వీరి ఆరోపణలపై ఐటా స్పందించింది. ‘ట్విటర్‌లో బోపన్న, సానియా చేసిన ఆరోపణలకు అర్థం లేదు. ఈమేరకు బోపన్న, సానియా ఐటీఎఫ్‌ రూల్స్‌ పుస్తకంలో ఒలింపిక్స్‌ నిబంధనలను మరోసారి క్షుణ్ణంగా చదువుకోవాలని’’ వారి విమర్శలను తిప్పికొట్టింది. బోపన్న 38వ ర్యాంకులో ఉండగా, దివిజ్‌ శరణ్‌ 75వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. వీరిద్దిరి ర్యాంకులు కలిపి 113 ఉండడంతో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయాడు. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతుండడంతో.. పరిస్థితులు ఎలా ఉంటాయోనని అథ్లెట్లు ఆందోళన చెందుతున్నారు.

Also Read:

Tokyo Olympics 2021: మరో కోవిడ్ కేసు నమోదు.. ఒలింపిక్ విలేజ్‌లో 58కి చేరిన సంఖ్య.. భయాందోళనలో అథ్లెట్లు!

21 భవనాలు.. 18 అంతస్తులు.. మూడు వైపులా సముద్రం.. రూ. 36 బిలియన్లతో ఒలింపిక్ విలేజ్ నిర్మాణం..!