Tokyo Olympics 2020: హాకీలో టీమిండియా దూకుడు.. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం..!

|

Jul 27, 2021 | 10:14 AM

Tokyo Olympics 2020: స్పెయిన్‌ను 3-0తో ఓడించి భారత పురుషుల హాకీ టీం రెండో విజయాన్ని నమోదు చేసింది. దాంతో క్వార్టర్ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Tokyo Olympics 2020: హాకీలో టీమిండియా దూకుడు.. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం..!
Indian Hockey Team
Follow us on

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత హాకీ ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. ఈ విషయంలో ఆటగాళ్లు కూడా కలత చెంది ఉంటారు. ఆ కసితో ఈ రోజు ఉదయం స్పెయిన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో అద్భుతంగా తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. భారత్ 3-0తో స్పెయిన్‌ను ఓడించింది. ఈ విజయంతో పూల్ ఏలో భారత్ స్థానం మరితం మెరుగైంది. ఆస్ట్రేలియా తరువాత పూల్ ఏలో రెండవ స్థానంలో నిలిచింది. నాలుగు క్వార్టర్స్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత ఆటగాళ్లు.. స్పెయిన్‌ జట్టును ఏ మాత్రం కోలుకోనివ్వలేదు. మూడు క్వార్టర్స్‌ ముగిసేసరికి 2-0తో నిలిచిన భారత టీం.. చివరి క్వార్టర్స్‌లో రూపిందర్‌పాల్‌ సింగ్‌ రెండో గోల్‌ చేయడంతో 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం నిర్ణీత సమయంలో స్పెయిన్‌ జట్టు ఎలాంటి గోల్‌ చేయకపోవడంతో టీమిండియా ఘన విజయాన్ని సాధించి, పతక ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. భారత్‌ తరపున రూపిందర్‌ పాల్‌ సింగ్‌ 2, సింగ్‌ సిమ్రన్‌జిత్‌ ఒక గోల్‌ చేశారు. ఈ విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉన్నాయి.

తొలి క్వార్టర్‌లో 2 గోల్స్..
మ్యాచ్‌ తొలి క్వార్టర్‌ 14 వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్‌ తొలి గోల్ చేశాడు. దీంతో భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఒలింపిక్స్‌లో సిమ్రన్‌జిత్‌ చేసిన మొదటి గోల్ కూడా ఇదే కావడం విశేషం. అనంతరం భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న రూపీందర్ పాల్ సింగ్.. అద్భుత గోల్‌తో భారత్ 2-0తో ఆధిక్యంలోకి చేరుకుంది.

రెండు, మూడు క్వార్టర్స్‌లో నో గోల్స్..
భారత్, స్పెయిన్ టీంలు రెండు, మూడు క్వార్టర్స్‌లో గోల్స్ చేయలేదు. రెండు జట్టు దూకుడుగా తలపడ్డాయి. స్పెయిన్‌ జట్టుకు పెనాల్టీలు లభించినా వాటిని గోల్స్‌గా మలచడంలో ఆ జట్టు విఫలమైంది. భారత జట్టు 2-0 తేడాతో కొనసాగింది.

నాలుగో క్వార్టర్‌లో టీమిండియా దూకుడు
పెనాల్టీలను స్కోర్లుగా మలిచే అవకాశాన్ని స్పెయిన్ కోల్పోయింది. కానీ, పెనాల్టీ కార్నర్‌లో గోల్ సాధించే అవకాశాన్ని భారత్ వదిలిపెట్టలేదు. మ్యాచ్ 51 వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ అద్భుతంగా గోల్ చేశాడు. దీంతో భారత్ 3-0 ఆధిక్యం సాధించి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పెనాల్టీ కార్నర్స్, పెనాల్టీ స్ట్రోక్స్, ఫీల్డ్ గోల్స్ సాధించడం విశేషం.

Also Read: Mirabai Chanu: ‘ఈ పతకం దేశ ప్రజలకు అంకితం.. వారి సహాయం లేకుంటే విజయం కఠినమయ్యేది’

Tokyo Olympics 2020: ప్రమోషన్‌తోపాటు రూ. 2 కోట్లు.. మీరాబాయి చానుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన భారతీయ రైల్వే