Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ మూడవ రోజు భారతదేశానికి చేదు అనుభవం మిగిలింది. దీంతో అందరి చూపు 4 వ రోజు ఆటపై పడ్డాయి. నాలుగవ రోజు భారతదేశం తరపున కొంతమంది ఆటగాళ్లు పతకం వైపు కదులుతుండగా, చాలామంది టోక్యో ఒలింపిక్స్ వేదికపై మొదటిసారి బరిలోకి దిగనున్నారు. మహిళల ఫెన్సింగ్ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీ దేవి ఇందులో ఉంది. హాకీ, బాక్సింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ వంటి క్రీడలలో భారత్ తన సత్తాను చూపనుంది.
పురుషుల బాక్సింగ్‌లో అమిత్ పంగల్, ఆశిష్ కుమార్ నాల్గవ రోజు నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. బ్యాడ్మింటన్‌లోనూ తన సత్తాను చాటేందుకు సిద్ధమైంది. పురుషుల ఆర్చరీలో జరిగే పతకాల మ్యాచ్‌లో భారత్ కజకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో మహిళల హాకీ పోటీ కూడా జరగనుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో మూడవ రోజు భారత్‌కు అంతగా కలిసి రాలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్ నిరాశపరిచింది. బ్యాడ్మింటన్‌లో మొదటి రౌండ్‌లో పీవీ సింధు విజయం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రెండవ షూటింగ్ ఈవెంట్‌లో భారత్ నిరాశను ఎదుర్కోవలసి వచ్చింది. మేరీ కోమ్ తన పంచ్‌తో తరువాత రౌండ్‌కు చేరింది. నాలుగవ రోజు షూటింగ్‌లో పురుషుల స్కీటింగ్ ఈవెంట్‌లో అంగద్ వీర్ సింగ్, మైరాజ్ అహ్మద్ పోటీపడనున్నారు.
నాలుగవ రోజు కూడా షూటింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. మరోసారి భారత్ ఈ ఈవెంట్‌లో పతకం కోసం ఎదురుచూస్తోంది. మొదటి మూడు రోజులు షూటింగ్ విభాగంలో నిరాశే ఎదురైంది. దీంతో నాలుగవ రోజు షూటింగ్ ఈవెంట్‌లోనైనా పతకం దక్కుతుందో లేదో చూడాలి. ఇక భవానీ దేవి ఫెన్సింగ్ ఆటపై ఆసక్తి నెలకొంది. తన మొట్టమొదటి ఒలింపిక్స్ ఆడుతున్న భవానీ దేవి, చిరస్మరణీయంగా మార్చేందుకు చూస్తోంది.
Also Read:
IND vs SL 1st T20: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. 126 పరుగులకు ఆలౌట్