Tokyo Olympics 2021: మొన్నటి వరకు ఆమె ఓ సాధారణ అథ్లెట్.. ఆదేశంలోనూ ఎక్కువ మందికి ఆమె తెలియదు. టోక్యో ఒలింపిక్స్ ఆమె జీవితాన్నే కాదు.. ఒలింపిక్స్‌లో ఫిలిప్పీన్స్ చరిత్రనే మార్చేసింది. ప్రస్తుతం ఆదేశంలో ఆమె ఓ హాట్‌టాపిక్‌గా మారిపోయారు. వివరాల్లోకి వెళ్తే..టోక్యో ఒలింపిక్స్‌లో ఫిలిప్ఫిన్స్ వెయిట్‌లిఫ్టర్ హిడ్లీ డియాజ్ సంచలనానికి మారుపేరుగా మారిపోయారు. మహిళల 55 కిలోల విభాగంలో చరిత్ర సృష్టిస్తూ బంగారు పతకాన్ని గెలుచుకుంది. తన కెరీర్‌లో నాలుగో ఒలింపిక్ గేమ్స్ ఆడిన 30 ఏళ్ల డియాజ్.. ప్రస్తుతం ఆ దేశంలో హాట్ టాపిక్‌గ మారారు. మహిళల 55 కిలోల విభాగంలో ఒలింపిక్ రికార్డును సృష్టించి పతకం సాధించింది. మొత్తం 224 కేజీలు ఎత్తి తొలి స్థానంలో నిలిచింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 127 కేజీలు ఎత్తిన డియాజ్.. అంతకుముందు చైనా మహిళ లివో ఒలింపిక్ రికార్డును(126 కేజీలు) బద్దలు కొట్టింది. ఫిలిప్ఫీన్స్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్ నుంచి బంగారు పతకాన్ని అందించింది. ఇంతటి ఘనత సాధించిన డియాజ్.. విజేతగా నిలిచిన సందర్భంలో గట్టిగా ఏడ్చేస్తూ కోచ్‌లను ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
మలేషియాలో శిక్షణ పొందుతున్నప్పుడు కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో కుటుంబానికి దాదాపు ఏడు నెలలు దూరంగా ఉండిపోయింది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ, ‘నా తల్లిని, ఆమె చేతి వంటను చాల మిస్ అవుతున్నాను. కానీ, నా లక్ష్యం కోసం ఇది తప్పదు. ఎలాగైనా టోక్యోలో పతకం సాధింస్తానని’ చెప్పుకొచ్చింది.
ఈ విజయంతో డియాజ్.. 33 మిలియన్ల పెసోలు (సుమారు రూ. 6 కోట్లు) ప్రభుత్వం నుంచే కాక ఆదేశ వ్యాపార వేత్తల నుంచి నగదు బహుమతులు అందుకుంది. అలాగే ఓ ఇంటిని కూడా బహుమతిగా అందుకుంది. డియాజో విజయానికి ఫిలిప్ఫిన్స్ దేశం మొత్తం గర్వంగా ఉందని ఆదేశ ప్రతినిధి హ్యరీ రోక్ వెల్లడించాడు.
?Weightlifter Hidilyn Diaz just became the first #Olympic gold medalist from the Philippines.
Earlier, we spoke to her about what it was like training during the Covid pandemic #Tokyo2020 pic.twitter.com/ucWn067frP
— Bloomberg Quicktake (@Quicktake) July 26, 2021
Tokyo Olympics 2020: పతకానికి అడుగు దూరం.. అరంగేట్ర ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ అరుదైన రికార్డు!