Neeraj Chopra: ప్రస్తుతం ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న నీరజ్ చోప్రా గురించే ప్రస్తావిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారుడిగా సరికొత్త చరిత్రను లిఖించాడు నీరజ్. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా నజరానాలు కూడా వెల్లవెత్తుతున్నాయి. అయితే నీరజ్‌కు ఈ విజయం అంత సులభంగా రాలేదు. దీని వెనక ఎంతో కఠోర శ్రమ ఉంది. ఒకానొక సమయంలో 90 కేజీల బరువుతో సతమతమైన నీరజ్.. తనను తాను మార్చుకొని క్రీడారంగంలో ఉన్నత స్థాయికి ఎదిగాడు.
నీరజ్ చోప్రా స్వర్ణాన్ని గెలిచి దేశం దృష్టి ఆకర్షిస్తోన్న వేళ ఆయన ప్రాక్టిస్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఫిట్‌నెస్‌ను సాధించుకునే క్రమంలో, సాధించిన ఫిట్‌నెస్‌ను కొనసాగించేందుకు నీరజ్ ఎంతలా కృషిచేస్తాడో ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. నీరజ్ ప్రాక్టిస్ చేస్తోన్న సమయంలో తీసిన వీడియోను చూస్తుంటే ప్లేయర్స్ ఇంతలా కష్టపడతారా.. అనక మానదు. నీరజ్ ప్రాక్టిస్‌కు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
హర్యానాలోని పానిపట్ లో జన్మించిన నీరజ్ చోప్రా అక్కడే పెరిగిన.. నీరజ్ ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్ గా పనిచేస్తున్నాడు. నీరజ్ చోప్రాలో 2018లో తన అత్యుత్తమ ప్రదర్శనను (88.06 మీటర్లను) సాధించాడు. భారత చరిత్రలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న క్రీడాకారుడిగా నిలిచాడు. ఇక శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ మొదటి నుంచే నీరజ్ దూకుడుగా రాణించాడు. మొదటి అవకాశంలోనే నీరజ్ 87.03 మీటర్లు విసిరాడు.
Also Read: Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డు.. భారత్ ఖాతాలో ఏడు పతకాలు
Ananta Sriram: గేయ రచయిత అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే..