Mirabai Chanu: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చాను.. ఒలింపిక్స్‌లో రెండవ రోజే త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. దీంతో చానుకి సొంత రాష్ట్రం మణిపూర్ భారీ నజారానా ప్రకటించింది. రూ.కోటి నగదు బహుమతిని అందివ్వనున్నట్లు మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ప్రకటించారు. మొదటి నుంచి పతకం సాధించే లిస్టులో ఉన్న చాను.. అనుకున్నమేర రాణించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్ ఎత్తి పతకం మీద ఆశలు పెంచింది. మొత్తంమీద 202 కేజీలు ఎత్తిన చాను.. స్వర్ణ పతకం కోసం జరిగిన మూడవ అటెంప్ట్‌లో విఫలమైంది. దాంతో రెండవ స్థానంలో నిలవడంతో రజత పతకం సొంతమైంది.
ఆమె విజయంతో దేశమంతా హర్షాతిరేకాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు చానుని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ అభినందించారు. ఈమేరకు హోంమంత్రి అమిత్ షాకు సమాచారం అందిచారు సీఎం బిరేస్ సింగ్. ఆ సమయంలో అమిత్ షా నార్త్ ఈస్ట్ సీఎంలతో మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో సమావేశమయ్యారు. చారు పతకం గెలిచిందన్న వార్త విన్న షాతో పాటు ముఖ్యమంత్రులందరూ లేచి నిలబడి ఆమెను ప్రశంసించారు. అంతకుముందు ముఖ్యమంత్రి బిరెన్ సింగ్.. చానుతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. మీరాబాయి తండ్రి సేఖోమ్ కృతి మీటీ మీడియాతో మాట్లాడుతూ.. ‘తన చిన్న కుమార్తె పతకం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ‘నా కుమార్తెను చూసి నేను గర్వపడుతున్నాను. భవిష్యత్తులో కూడా తనకు మా మద్దతు ఉంటుదని’ పేర్కొన్నాడు.
So good to speak to our Champion @mirabai_chanu today.@narendramodi @AmitShah @ianuragthakur @JPNadda @blsanthosh pic.twitter.com/1phL16ibh3
— N.Biren Singh (@NBirenSingh) July 24, 2021
Also Read:
Tokyo Olympics 2020, Day 3: 9 క్రీడల్లో భారత అథ్లెట్లు బరిలోకి…అందరి చూపు మేరీకోమ్, సింధులపైనే..